Tahawwur Ranas Lawyer: ఉగ్రవాది తహవ్వుర్ రాణా తరఫు న్యాయవాది ఎవరు?
ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఆయన తహవ్వుర్ రాణా(Tahawwur Ranas Lawyer) తరఫున కేసును వాదించనున్నారు.
- By Pasha Published Date - 11:39 AM, Fri - 11 April 25

Tahawwur Ranas Lawyer: 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవ్వుర్ రాణా ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నాడు. అతడిని గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపర్చగా, 18 రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ‘‘మీకు లాయర్ ఉన్నారా’’ అని తహవ్వుర్‌ను పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక ఎన్‌ఐఏ న్యాయమూర్తి చంద్రజిత్ సింగ్ ప్రశ్నించగా.. ‘‘లేరు’’ అని బదులిచ్చాడు. దీంతో తహవ్వుర్ రాణాకు న్యాయవాదిని ఏర్పాటు చేయాలని ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ(DLSA)ని కోర్టు ఆదేశించింది. దీంతో రాణా తరఫున వాదించడానికి న్యాయవాది పీయుష్ సచ్‌దేవాను DLSA నియమించింది.
Also Read :Assassination Files: రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల ఫైళ్లు.. ఎలా చంపారు ?
పీయుష్ సచ్‌దేవా ఎవరు?
- పీయుష్ సచ్‌దేవా (37) ఢిల్లీకి చెందిన న్యాయవాది.
- ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఆయన తహవ్వుర్ రాణా(Tahawwur Ranas Lawyer) తరఫున కేసును వాదించనున్నారు.
- భారత న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరికీ న్యాయ పోరాటానికి అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. ఈ నిబంధన ప్రకారమే తహవ్వుర్ రాణాకు కూడా న్యాయవాదిని కేటాయించారు.
- పీయుష్ సచ్‌దేవా 2011లో మహారాష్ట్రలోని పూణేలోని ఐఎల్‌ఎస్ లా కాలేజీ నుంచి లా డిగ్రీని పొందారు.
- లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ కమర్షియల్ లాలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.
- అంతర్జాతీయ చట్టాలు, క్రిమినల్ కేసులలో పీయుష్ సచ్‌దేవాకు లోతైన నాలెడ్జ్ ఉంది.
- ముంబై ఉగ్రదాడి జరిగి దాదాపు 17 సంవత్సరాలు గడిచాయి. కానీ ఈ కుట్రలో నిందితులైన చాలా మందికి ఇంకా శిక్ష పడలేదు.
- ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవ్వుర్ రాణాను ఎట్టకేలకు అమెరికా నుంచి భారతదేశానికి తీసుకువచ్చారు.
- ఈ ఉగ్రవాద దాడిని ఎలా ప్లాన్ చేశారు ? ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారు ? అనేది విచారణలో బయటపడనుంది.