HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Why Is The Center Not Taking Action On The Amrit Scandal Ktr

KTR : అమృత్‌లో కుంభకోణంపై కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?: కేటీఆర్‌

KTR : రాహుల్, రేవంత్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదే నిజమైతే మరి ఇప్పుడు అమృత్‌ పథకం కుంభకోణంపై కేంద్రం విచారణ చేపట్టాలని కేటీఆర్‌ అన్నారు.

  • Author : Latha Suma Date : 12-11-2024 - 1:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Why is the Center not taking action on the Amrit scandal?: KTR
Why is the Center not taking action on the Amrit scandal?: KTR

Amrit scheme : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో అమృత్‌ పథకంలో అవినీతి జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని, ఎందుకు చర్యలు చేపట్టడం లేదని అన్నారు. తెలంగాణలో తప్పులు జరుగుతున్నాయని ఆధారాలతో వివరాలు ఇస్తున్నాం. లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏటీఎంలా మార్చిందని ఆరోపించారు. రాహుల్, రేవంత్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదే నిజమైతే మరి ఇప్పుడు అమృత్‌ పథకం కుంభకోణంపై కేంద్రం విచారణ చేపట్టాలని కేటీఆర్‌ అన్నారు. మా ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని భావిస్తున్నాం.

మరి సీఎం రేవంత్‌రెడ్డి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి వస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 26 పైసలు కూడా రాలేదు. అల్లుడి కోసం కొడంగల్‌ను బలిపెట్టే పరిస్థితి తలెత్తింది. అందుకే అక్కడ తిరుగుబాటు మొదలైంది. అస్మదీయులకు లబ్ధి చేకూర్చారని ఝార్ఖండ్‌ సీఎంపై కేసు పెట్టారు. అదే కేసును రేవంత్‌, పొంగులేటిపై ఎందుకు పెట్టడం లేదు?” అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అర్హత లేకపోయినా శోధా కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని చెప్పారు. రూ. 1,137 కోట్లకు సంబంధించిన పనులు ఆ కంపెనీకి ఇచ్చారన్నారు. 2021-22 లో శోధా కన్‌స్ట్రక్షన్‌ నికర ఆదాయం రూ. 2.2 కోట్లు మాత్రమేనని, అలాంటి కంపెనీకి రూ. 800 కోట్ల టెండర్లు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. అమృత్‌ పథకం టెండర్లకు సంబంధించి వెబ్‌సైట్‌లో వివరాలు లేవని, కేంద్రం స్కీమ్‌లో అవినీతి జరిగితే ప్రధాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

కాగా, రాహుల్ గాంధీ మహరాష్ట్రలో అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మహరాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ సొమ్ములు తరలిపోతున్నాయని, ఇక్కడి ప్రజల సొమ్మును దోచుకుని అక్కడ ఎన్నికల్లో వాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఇచ్చిన హమీలు అమలు చేయకుండా, అమలుకు నిధులు లేవంటూనే.. అన్నీ అమలు చేసేశామంటూ మహారాష్ట్రలో అబద్ధాలను ప్రచారం చేయడమే కాకుండా దాని ప్రచారం కోసం అడ్డగోలుగా వందల కోట్ల ప్రజా ధనాన్ని వాడుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Gabbar Singh : ‘గబ్బర్ సింగ్’ అమ్జద్ ఖాన్ జయంతి.. విలన్ పాత్రతో హీరో ఇమేజ్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amrit scheme
  • Amrit scheme Corruption
  • central government
  • delhi tour
  • ktr
  • pm modi
  • rahul gandhi
  • telangana

Related News

Pacs Elections Telangana

సొసైటీల ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ?

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS)కు ఎన్నికలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో నామినేటెడ్ పద్ధతిలోనే పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం

  • Rahul Bjp Proposing Elimina

    సంస్థాగత వ్యవస్థలన్ని బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి – రాహుల్ కీలక వ్యాఖ్యలు

  • Liquor Sales Telangan

    దక్షిణాది లిక్కర్ కిక్కులో తెలంగాణ మొనగాడు

  • Ap Ts Christmas Holidays Sc

    తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూల్స్ కు క్రిస్మస్ సెలవులు

  • Modi- Chandrababu

    ప్ర‌ధాని రేసులో సీఎం చంద్ర‌బాబు?!

Latest News

  • ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

  • మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?

  • జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

  • ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ నిర్మాణాలకు తక్కువ ధరకే సిమెంట్‌

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd