HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do You Know Why You Shouldnt Sleep With Your Head Pointing Towards The North

Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?

  • Author : Vamsi Chowdary Korata Date : 17-06-2026 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do you know why you shouldn't sleep with your head pointing towards the north?
Do you know why you shouldn't sleep with your head pointing towards the north?

ఇంట్లో పెద్దలు పడుకునేటప్పుడు ఉత్తర దిశగా తల పెట్టి పడుకోకూడదని చెబుతూ ఉంటారు. ఎందుకు అంటే రకరకాల కారణాలను చెబుతూ ఉంటారు. ఇంకొందరు చెప్పింది చేయకపోతే ప్రశ్నలు వేస్తారని పిల్లలను అరుస్తూ ఉంటారు. మరి నిజానికి ఉత్తర దిశగా ఎందుకు పడుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరానికి అధిపతి కుబేరుడు, దక్షిణానికి అధిపతి యముడు. ఉత్తర దిశగా తల పెట్టి పడుకున్నప్పుడు లేవగానే దక్షిణ దిశ వైపు చూస్తారనే ఉద్దేశంతో ఉత్తర దిశలో తల పెట్టి పడకూడదని చెబుతున్నారు. సైన్స్ ప్రకారం చూసుకుంటే..

దక్షిణం నుంచి ఉత్తరానికి (భూ అయస్కాంత క్షేత్రం) నిరంతరం ప్రయాణిస్తూ ఉంటుంది. అలా ఉత్తర దిశలో పడుకోవడం వల్ల మన రక్త ప్రసరణ వ్యతిరేక దిశలో కొనసాగడం వల్ల మనలోకి తెలియని నెగిటివ్ శక్తి ప్రవేశిస్తుంది. ఒత్తిడికి నిద్ర సరైన మందు. చాలా సందర్భాల్లో ప్రజలు నిద్రిస్తున్నప్పుడు ఏ దిశలో నిద్రపోతామనే విషయమై అంతగా శ్రద్ధ చూపరు. కానీ వాస్తు శాస్త్రంలో ఎలా పడితే అలా పడుకోవడం నిషేధం. ఇది తప్పుగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. నిద్రపోయేటప్పుడు దిశపై ప్రత్యేక శ్రద్ధ అవసరం, లేకపోతే అది వాస్తు దోషానికి కారణం అవుతుంది. ఇది జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

మీ తల ఉత్తరం వైపు, పాదాలు దక్షిణం వైపు అస్సలు ఉండకూడదట. హిందూ మతంలో చనిపోయినవారిని మాత్రమే ఉత్తరం వైపు తల పెట్టి అంత్యక్రియలు చేస్తారు. తలను ఉత్తరం వైపు, పాదాలను దక్షిణం వైపు ఉంచడం ద్వారా ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందని నమ్ముతారు. దక్షిణం యమ స్థానం. అందుకే ఉత్తరాన పడుకునే వారు నిద్రలేస్తే మొదట చూసేది దక్షిణ దిశ కాబట్టి ఆ దిశలో తల పెట్టి నిద్రించకూడదని చెబుతారు. ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ తూర్పు వైపు తల ఉంచాలి. ఎందుకంటే సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. సూర్యుని వైపు తల పెట్టి పడుకోవడం మానసిక, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. అలాగే దక్షిణం వైపు తల పెట్టి నిద్రించవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదని పండితులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 8 Hours Sleep
  • north
  • north sleeping
  • Sleeping benefits

Related News

    Latest News

    • Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?

    • Donald Trump: ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

    • Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

    • White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

    • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd