KG Ghee – 2 Lakhs : ఈ నెయ్యి కేజీకి రూ.2 లక్షలు.. ఎందుకు ?
KG Ghee - 2 Lakhs : సాధారణంగా మన దేశంలో కిలో నెయ్యి ధర రూ.640 నుంచి రూ.750 దాకా ఉంది.
- By Pasha Published Date - 12:00 PM, Fri - 13 October 23
KG Ghee – 2 Lakhs : సాధారణంగా మన దేశంలో కిలో నెయ్యి ధర రూ.640 నుంచి రూ.750 దాకా ఉంది. కానీ గుజరాత్ లోని రాజ్‌కోట్ పరిధిలోని గోండాల్‌లో తయారయ్యే కేజీ నెయ్యి ధర ఎంతో తెలుసా ? అక్షరాలా రూ.2లక్షలు !! ఈ నెయ్యి రేటు ఇంత రేంజ్ లో ఎందుకు ఉందనే డౌట్ వస్తోందా ? దీనికి ఒక క్లియర్ కట్ ఆన్సర్ ఉంది. అదే ‘క్వాలిటీ’ !!గోండాల్‌లో ‘గిర్ గౌ జతన్ సంస్థాన్’ పేరుతో గోశాలను నడుపుతున్న రమేష్‌భాయ్ రూపరేలియా ఈ స్పెషల్ నెయ్యిని తయారు చేస్తున్నాడు. ఈ గోశాలలో 200కుపైగా ఆవులు ఉన్నాయి. ఈ గోశాలలోని ఆవుల పాలను అమ్మకుండా.. వాటితో మజ్జిగ తయారు చేస్తారు. ఆ మజ్జిగను చిలికి వెన్న తీసి నెయ్యిని రెడీ చేస్తారు. ఇలా స్వచ్ఛంగా తయారుచేసే నెయ్యిలో కిలోకు దాదాపు రూ.6వేలు విలువ కలిగిన ఆయుర్వేద మూలికలను కలుపుతారు. ఈ నెయ్యి తయారీకి కుంకుమపువ్వు, పసుపు, దారు హల్దీ, ఛోటీ పీపాల్ మొదలైన అనేక ఔషధాలను కూడా వాడుతారు. ఈవిధంగా ఒక కేజీ ప్యూర్ నెయ్యిని తయారు చేయడానికి 31 లీటర్ల పాలను వాడుతారు. అందుకే ఈ నెయ్యి రేటు ఇంత ఎక్కువ.
We’re now on WhatsApp. Click to Join.
సామాన్యుల కోసం కాస్త తక్కువ క్వాలిటీ కలిగిన నెయ్యిని ‘గిర్ గౌ జతన్ సంస్థాన్’ వాళ్లు అవుతున్నారు. దాని కనీస ధర (కేజీకి) కూడా రూ.3,500 నుంచి మొదలవుతుంది. అంటే కనీసం రూ.3,500 ఉంటేనే ఇక్కడ కేజీ నెయ్యిని కొనగలుగుతాం. నెయ్యిలో కలిపే మూలికల మోతాదు పెరిగే కొద్దీ , నెయ్యి రేటు కూడా పెరుగుతూపోతుంది. ఈ గోశాలలో నెయ్యి తయారీలో దాదాపు 140 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.
ఈ నెయ్యిని తినకూడదు..
గోండాల్‌లో తయారయ్యే ఈ స్వచ్ఛమైన నెయ్యితో తలనొప్పి, చర్మ వ్యాధులు, దగ్గు వంటివి తగ్గుతాయని, గ్లామర్ పెరుగుతుందని కూడా చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఈ నెయ్యిని తినకూడదు. రాత్రి పడుకునే ముందు ఈ నెయ్యిని ముఖానికి రాసుకుని మర్దన చేసుకొని పడుకోవాలి. ఈ నెయ్యిని ఇంతకీ ఎవరు కొంటారు ? అని భావిస్తున్నారు కదూ.. మరేం లేదు అత్యంత సంపన్న దేశాలైన అమెరికా, కెనడా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఈ నెయ్యి సేల్స్ జరుగుతున్నాయి. ప్రతినెలా ఆ దేశాల్లో గోండాల్ నెయ్యికి సంబంధించిన దాదాపు రూ.40 లక్షల వ్యాపారం జరుగుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు రూ.4 కోట్ల గోండాల్ నెయ్యి అమ్మకాలు (KG Ghee – 2 Lakhs) జరుగుతున్నాయి.
Related News
Mutton Pulusu : మటన్ పులుసు.. ఇలా చేస్తే ముక్క వదలకుండా తింటారు..
మటన్ తో రకరకాల వంటలు చేసుకోవచ్చు. మటన్ ఇగురు, గోంగూర మటన్, దోసకాయ మటన్.. రుచిగా చాలా వండుకోవచ్చు. అలాగే పులుసు కూడా చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, రాగి సంకటి.. ఇలా దేనితో కలిపి తినేందుకైనా టేస్టీగా ఉంటుంది.