TTD : శ్రీవారి స్వచ్ఛంద సేవలు పలు మార్పులు..ఈ నెల 30న కోటా విడుదల
ఈ మార్పులకు అనుగుణంగా జూన్ మాసం ఆన్‌లైన్ కోటాను టీటీడీ ఈనెల 30న విడుదల చేయనుంది. జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) – ఉదయం 11:00 గంటలకు. నవనీత సేవ (మహిళలకు మాత్రమే) – మధ్యాహ్నం 12:00 గంటలకు.. పరకామణి సేవ (పురుషులకు మాత్రమే) – మధ్యాహ్నం 1:00 గంటలకు.. గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభించిన సేవ) – మధ్యాహ్నం 2:00 గంటలకు విడుదల చేస్తారని టీడీపీ తెలిపింది.
- By Latha Suma Published Date - 10:26 AM, Tue - 29 April 25

TTD : తిరుమల శ్రీవారి స్వచ్ఛంద సేవలు పలు మార్పులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు టీటీడీ అధికారులు ఇప్పటికే శ్రీసత్యసాయి సేవాసంస్థ(పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్(బెంగళూరు) వంటి సంస్థలను సందర్శించి అధ్యయనం చేశారు. దీంతో ఈ మార్పులకు అనుగుణంగా జూన్ మాసం ఆన్‌లైన్ కోటాను టీటీడీ ఈనెల 30న విడుదల చేయనుంది. జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) – ఉదయం 11:00 గంటలకు. నవనీత సేవ (మహిళలకు మాత్రమే) – మధ్యాహ్నం 12:00 గంటలకు.. పరకామణి సేవ (పురుషులకు మాత్రమే) – మధ్యాహ్నం 1:00 గంటలకు.. గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభించిన సేవ) – మధ్యాహ్నం 2:00 గంటలకు విడుదల చేస్తారని టీడీపీ తెలిపింది.
Read Also: Indiramma Houses Scheme : మాట మార్చిన ప్రభుత్వం..లబ్ధిదారులు ఆందోళన
ఇక, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు రెండేళ్లుగా సేవలో పాల్గొంటున్నారు. వయసు 45-70 సంవత్సరాల మధ్య ఉన్నవారు నమోదు కావచ్చు. వీరు 15 రోజులు, నెల లేదా మూడు నెలల వ్యవధితో సేవ చేయడానికి ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవచ్చు. ఇక పై వీరిని గ్రూప్ లీడర్స్ అని పిలుస్తారు. వీరు శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, వారి హాజరు తీసుకోవడం, వ్యక్తిగత పనితీరును ముల్యాంకనం చేయడం వంటి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. పరకామణి సేవలో కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్ ద్వారా పరకామణి సేవను నమోదు చేసుకోవచ్చు. టీటీడీ ఇప్పటికే జులై నెలకు సంబంధించిన దర్శన టోకెన్లు, ఆర్జిత సేవ టికెట్లు, వసతి గదుల్ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.