Polycet : తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదల
- By Latha Suma Published Date - 01:36 PM, Mon - 3 June 24

Telangana Poliset Results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మే 24వ తేదీన పాలిసెట్ రాత పరీక్షకు 82,809 మంది హాజరయ్యారు. పాలిసెట్ పరీక్షల్లో 84.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
మొత్తం 69వేల 728 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. మే 24వ తేదీన జరిగిన పరీక్షకు 92వేల 808 మంది దరఖాస్తు చేసుకోగా .. 82వేల 809 మంది పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి అప్లికేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
Read Also: Nitish Meets Modi: మోడీని కలిసిన నితీష్ కుమార్
కాగా, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 49 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక పరీక్షకు హాజరైన విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులు ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు..
. ఇందుకోసం విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
. అనంతరం హోమ్ పేజీలో కనిపించే ర్యాంక్ కార్డ్‌పై క్లిక్ చేయాలి.
. అక్కడ హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌పై నొక్కాలి. వెంటనే ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
Read Also: NTR31 : ఎన్టీఆర్, నీల్ సినిమాలో హీరోయిన్‌గా ఆ భామ..