Laddu Prasadam : లడ్డు వివాదం ఫై టీటీడీ ఈఓ శ్యామలరావు క్లారిటీ
Laddu Prasadam : లడ్డు వివాదం ఫై టీటీడీ ఈఓ శ్యామలరావు క్లారిటీ
- By Sudheer Published Date - 03:23 PM, Fri - 20 September 24

తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదంలో నెయ్యి (Pure Ghee)కి బదులు జంతువుల కొవ్వు , (Animal Fat ) వాడారని సీఎం చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై రెండు రోజులుగా యావత్ హిందువులు, రాజకీయేతర పార్టీల నేతలు జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అలాంటిదేమి అంటూ ప్రమాణాలకు సిద్ధం అంటున్నారు. దీనిపై కోర్ట్ లో సైతం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
ఈ క్రమంలో దీనిపై టీటీడీ ఈఓ శ్యామలరావు శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నెయ్యి విషయంలో క్లారిటీ ఇచ్చారు. గత కొద్దీ రోజులుగా లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో నాణ్యతాఫై అనేక పిర్యాదులు అందుతున్నాయి. దీంతో స్వయంగా వెళ్లి చూసా.. లోపాన్ని తాను గమనించానని పేర్కొన్నారు. ‘నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. రూ.320కి కల్తీ నెయ్యి మాత్రమే వస్తుంది. తక్కువ ధర కారణంగా నాణ్యత క్షీణిస్తుంది. నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.75 లక్షలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటయ్యేది. కానీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also : Congress MLA Offered Reward: కేంద్రమంత్రి తల నరికితే నా మూడెకరాల భూమి ఇస్తా: తెలంగాణ ఎమ్మెల్యే