Mlas Defection Case : పార్టీ ఫిరాయింపుల కేసు..తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరు వైపులా వాదనలు విని సీజే ధర్మాసనం. విచారణ తీర్పు రిజర్వు చేసింది.
- By Latha Suma Published Date - 05:33 PM, Tue - 12 November 24

Telangana High Court : తెలంగాణ హైకోర్టు నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో విచారణ ముగిసింది. ఈ కేసులో తీర్పును హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. బీఆర్‌ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణ అర్హత లేదన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరు వైపులా వాదనలు విని సీజే ధర్మాసనం. విచారణ తీర్పు రిజర్వు చేసింది.
ఇకపోతే.. ఇదే కేసులో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లలో సింగిల్ జడ్జి సరైన ఉత్తర్వులే జారీ చేశారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది జే.ప్రభాకర్‌రావు తన వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, శ్రీహరి ల పైన అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో, సభ ఓటింగ్‌లో గానీ పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ఇంతకుముందే తోసిపుచ్చింది. అనర్హత పిటిషన్లపై తేల్చకుండా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది.