HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Pakistan Reopens Wagah Border

Pak Citizens : మళ్లీ వాఘా సరిహద్దును తెరిచిన పాకిస్థాన్‌

భారత్‌ మొత్తం మూడు రకాల వీసాల వారిని దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశించింది. కానీ, వీరికి ఉపశమనం ఇచ్చినట్లు గురువారం వార్తలు వచ్చినా.. అధికారిక సమాచారం ఏమీ లేదు. అయితే పాకిస్థాన్‌ వైఖరికి విరుద్ధంగా, భారత ప్రభుత్వం తదుపరి నోటీస్‌ జారీ చేసేవరకు అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్‌ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అంగీకరించింది.

  • Author : Latha Suma Date : 02-05-2025 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan reopens Wagah border
Pakistan reopens Wagah border

Pak Citizens : పాకిస్థాన్‌ అట్టారీ-వాఘా సరిహద్దును మళ్లీ తెరిచింది. భారత్‌ నుంచి వస్తున్న తమ పౌరులు స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తూ వాఘా సరిహద్దు వద్ద గేట్లను శుక్రవారం ఉదయం తెరిచింది. గతనెల 30వ తేదీ తర్వాత పాక్‌ ఈ సరిహద్దును పూర్తిగా మూసేసింది. పహల్గాంలో దాడి తర్వాత పాక్‌పై దౌత్య చర్యల్లో భాగంగా ఆ దేశస్థులకు జారీ చేసిన స్వల్పకాలిక వీసాలను భారత్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే.

Read Also: Amaravati Relaunch : అమరావతి ప్రయోజనాలు తెలిస్తే వామ్మో అనకుండా ఉండలేరు !

కాగా, భారత్‌ మొత్తం మూడు రకాల వీసాల వారిని దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశించింది. కానీ, వీరికి ఉపశమనం ఇచ్చినట్లు గురువారం వార్తలు వచ్చినా.. అధికారిక సమాచారం ఏమీ లేదు. అయితే పాకిస్థాన్‌ వైఖరికి విరుద్ధంగా, భారత ప్రభుత్వం తదుపరి నోటీస్‌ జారీ చేసేవరకు అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్‌ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా సరిహద్దును పాక్‌ తెరిచి తమ పౌరులను స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పించింది.

తమ దేశ పౌరులకు వీసాలు భారత్‌ హఠాత్తుగా రద్దు చేయడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంపై దృష్టిపెడతామని ఆ దేశ విదేశాంగశాఖ పేర్కొంది. ముఖ్యంగా మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకొంటున్నవారు మధ్యలో తిరిగి స్వదేశాలకు రావాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించింది. ఇక, భారత్‌ నుంచి 911 మంది పాక్‌ జాతీయులు స్వదేశానికి వెళ్లారు. ఆతర్వాత దాదాపు 24 గంటలపాటు పాకిస్థాన్‌ నుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో భారత్‌లో నిలిచిపోయినవారు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా ఆ సరిహద్దును తెరిచి.. తమ జాతీయులను వెనక్కి తీసుకొంటోంది.

Read Also: Amaravati : ఏపీలో మహోన్నత ఘట్టం..పెద్దఎత్తున రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్న ప్రజలు

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Attari-Wagah Border
  • india
  • Pahalgam Terror Attack
  • Pak Citizens

Related News

Tahawwur Rana

ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!

మే 31, 2024 నాటి లేఖలో IRCC రాణాకు నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందినందున, అది చెల్లదని పేర్కొంది.

  • Trump's 10% Global Tariffs

    Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?

  • US Tariffs

    Trump Tariffs : అంతలేదు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది – ట్రంప్ స్పష్టం

Latest News

  • జింబాబ్వేపై టీమిండియా ఘ‌న‌విజ‌యం!

  • ఏ పండు తినడం వల్ల శరీరానికి అధిక ప్రోటీన్ ల‌భిస్తుందో తెలుసా?

  • భూభారతి పేరుతో.. కాంగ్రెస్ మార్క్ అవినీతి: మాజీ మంత్రి హరీష్ రావు

  • జింబాబ్వేపై భార‌త్ విధ్వంసం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండో అత్యధిక స్కోరు!

  • వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూప‌ర్ విక్ట‌రీ.. భార‌త్‌కు ఊర‌ట‌!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd