HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Grand Event In Ap People Are Reaching The Capital Area In Large Numbers

Amaravati : ఏపీలో మహోన్నత ఘట్టం..పెద్దఎత్తున రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్న ప్రజలు

ప్రధాని మోడీ రాష్ట్రంలో రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.

  • Author : Latha Suma Date : 02-05-2025 - 11:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
A grand event in AP.. People are reaching the capital area in large numbers.
A grand event in AP.. People are reaching the capital area in large numbers.

Amaravati : నేడు ఏపీలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఆంధ్రుల ఆశగా, ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడకకు అంతా సిద్ధమైంది. దీంతో ఐదు కోట్ల ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. వెలగపూడిలో ‘అమరావతి పునఃప్రారంభం’ పేరుతో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ రాష్ట్రంలో రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. జిల్లాల నుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్నారు.

Read Also: Hyundai: భార‌త్‌లో హ్యుందాయ్ స‌రికొత్త రికార్డు.. 90 ల‌క్ష‌ల వాహ‌నాలు విక్ర‌యం!

ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ప్రాంతాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది. రాజధాని పరిధిలోని తుళ్లూరులో రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ ప్రాంతం నుంచి వస్తున్న వాహనాలు చిలకలూరిపేట బైపాస్ వద్ద 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి గుంటూరు మీదుగా అమరావతికి చేరుకుంటున్నాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీపై కూటమి పార్టీల జెండాలు కట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో అలంకరించారు. రాజధాని పరిధిలోని తుళ్లూరులో రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల కోసం 35 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు పెట్టారు. ప్రతి గ్యాలరీలో వేదిక కనిపించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాటర్‌ ప్రూఫ్ షెడ్లు వేశారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు పెట్టారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్యాలరీలో తాగునీరు, మజ్జిగ అందిస్తారు. ముఖ్యమైన వ్యక్తుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజల కోసం మిగిలిన ప్రాంతాన్ని కేటాయించారు. భద్రత కోసం 6,500 మంది సిబ్బందిని నియమించారు. పర్యవేక్షణ కోసం 37 మంది IPS అధికారులను నియమించారు. వారికి సహాయంగా ట్రైనీ IPSలను కేటాయించారు.

కాగా, ప్రధాన వేదికపై ప్రధాని మోడీతో సహా 19 మంది కూర్చుంటారు. వారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్రమంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, సీఎస్‌ విజయానంద్ తదితర ముఖ్యులు ఉంటారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఇప్పటికే వేదికతో పాటు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి గుర్తుగా ఒక పైలాన్‌ను నిర్మిస్తున్నారు. దీనిని ప్రధాని మోడీ ఆవిష్కరిస్తారు.

Read Also: Hyderabad: ఆఫీస్ స్పేస్.. ఫుల్ ఖాళీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Amaravati reconstruction work inauguration ceremony
  • capital amaravati
  • pm modi

Related News

Chandrababu Naidu

TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN

తెలుగుదేశం పార్టీ బలం దాని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "టీడీపీ కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు తప్ప, ఎవ్వరికీ భయపడడు, ఎక్కడా తలవంచడు" అంటూ కార్యకర్తల ధైర్యాన్ని కొనియాడారు. పార్టీ 1982లో స్థాపించినప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లు చూసిందని

    Latest News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్‌లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.

    • Rashmi Gautam: వైసీపీ లీడర్‌పై యాంకర్ రష్మీ సీరియస్..!! నేను ఎవరికీ భయపడను.

    • Gold Rate Today: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

    • Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd