Trending
-
TG TET 2025 : జూన్ 18 నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు.. ఏ సబ్జెక్టు ఎప్పుడంటే?
పరీక్షల తేదీలు, సబ్జెక్టుల వారీగా సెషన్లు, జిల్లా వారీగా కేంద్రాల వివరాలు విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈసారి పరీక్షలు అనేక మార్పులతో నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.
Date : 04-06-2025 - 3:38 IST -
Ambati Rambabu : గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటి రాంబాబు హల్చల్
అంబటి రాంబాబు నేతృత్వంలోని వైసీపీ నాయకులు గుంటూరు కలెక్టరేట్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వారు యత్నించారు. అయితే కలెక్టరేట్ ప్రాంగణంలోకి ఒక్కసారిగా అనుమతించలేమని పోలీసులు వారిని నిలిపారు.
Date : 04-06-2025 - 3:01 IST -
Monsoon Session : జులై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
మొత్తం 23 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అయితే, వీటిలో వారం రోజుల వారాంతపు సెలవులు, రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం వంటి పండుగల నేపథ్యంలో కొన్ని రోజులు పనివేళలు ఉండకపోవచ్చు
Date : 04-06-2025 - 2:14 IST -
TTD : తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
గత రెండు రోజులుగా అధికారులు అతనిని ప్రశ్నిస్తూ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. సిట్ అధికారులు అప్పన్నతో పాటు టీటీపీకి చెందిన మరో ఆరుగురు ఉద్యోగులను విచారిస్తున్నారు. వీరంతా కల్తీ నెయ్యి సరఫరా, దాని వినియోగానికి సంబంధించిన పలు అనుమానాస్పద విషయాల్లో ప్రమేయం ఉన్నట్లు శంకిస్తున్నారు.
Date : 04-06-2025 - 1:55 IST -
Pak spy : పాక్‌కు గూఢచర్యం కేసు.. మరో యూట్యూబర్ అరెస్టు..
జస్బీర్ పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి షకీర్ అలియాస్ జుట్ రాంధావా, అలాగే పాక్ రాయబార కార్యాలయ అధికారిగా ఉన్న ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. డానిష్ ఆహ్వానంతో ఢిల్లీలో పాక్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన జాతీయ దినోత్సవ వేడుకకు సింగ్ హాజరైనట్టు అధికారులు గుర్తించారు.
Date : 04-06-2025 - 1:28 IST -
Botsa Satyanarayana : వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్పకు అస్వస్థత
బొత్స సత్యనారాయణ ఉదయం నిర్వహించిన ర్యాలీలో చురుకుగా పాల్గొన్నారు. ఆంజనేయపురం నుంచి మూడురోడ్ల కూడలి వరకూ కొనసాగిన ఈ ర్యాలీలో ఆయనతో పాటు అనేకమంది పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బొత్స తీవ్రంగా అలసటకు లోనైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Date : 04-06-2025 - 12:39 IST -
Kaleshwaram Commission Notices : కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా
ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది.
Date : 04-06-2025 - 12:07 IST -
RCB Victory Parade: ఆర్సీబీ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ కోసం విక్టరీ పరేడ్!
బెంగళూరులో జరిగే ఈ విక్టరీ పరేడ్‌లో ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పాల్గొననున్నారు. జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా విజయ రథంపై ఉంటాడు.
Date : 04-06-2025 - 12:04 IST -
IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025.. ఏ జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందంటే?
ఐపీఎల్‌కు ఇప్పుడు కొత్త ఛాంపియన్ లభించింది. ఆర్సీబీ 17 సంవత్సరాల ఎదురుచూపు ఇప్పుడు ముగిసింది. ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్‌ను ఓడించి మొదటిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Date : 04-06-2025 - 11:24 IST -
Kamal Haasan : కమల్‌హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా
కమల్ హాసన్ త్వరలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా, ఈ వివాదం నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘థగ్ లైఫ్’ సినిమాకు సంబంధించిన వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ దాఖలు చేస్తానని కమల్ భావిస్తున్నట్లు సమాచారం.
Date : 04-06-2025 - 11:21 IST -
AP Results Day : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు ఇది: : సీఎం చంద్రబాబు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తిరస్కరించిన రోజు ఇది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన సైకో పాలనకు ముగింపు పలికి, ప్రతి పౌరుడు స్వేచ్ఛతో ఊపిరి పీల్చిన తిత్లీ సమయంగా జూన్ 4 నిలిచింది అని చంద్రబాబు చెప్పారు.
Date : 04-06-2025 - 10:50 IST -
Virat Kohli Cry: 18 ఏళ్లుగా కోహ్లీ దాచుకున్న కన్నీళ్లు ఇవీ.. వీడియో వైరల్!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ మొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ మైదానం మధ్యలో చివరి బంతి పడకముందే కన్నీళ్లతో కనిపించాడు.
Date : 04-06-2025 - 12:14 IST -
Royal Challengers Bengaluru: 18 ఏళ్ల ఆర్సీబీ కల సాకారం.. ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్ (PBKS)ని 6 రన్ల తేడాతో ఓడించి. ఐపీఎల్ 18 సంవత్సరాల చరిత్రలో RCB మొదటిసారి చాంపియన్‌గా నిలిచింది.
Date : 03-06-2025 - 11:50 IST -
Kamal Haasan : నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు..ఫిలిం ఛాంబర్ కు కమల్ హాసన్ లేఖ
నా ఉద్దేశం ఒక్కటే తమిళ్, కన్నడ ప్రజలమంతా ఒక్క కుటుంబం. నేనెప్పటికీ కన్నడ భాషను తక్కువ చేయలేదు. ఆ భాషకు, ఆ సంస్కృతికి నేను చాలా గౌరవం ఇస్తాను. కన్నడ భాష కూడా తమిళంలాగే గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది.
Date : 03-06-2025 - 5:07 IST -
Ladakh : లద్దాఖ్‌లో రిజర్వేషన్లు, స్థానికతపై కేంద్రం కీలక ప్రకటన
ఈ నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 85 శాతం అవకాశాలను లద్దాఖ్ స్థానికులకే కేటాయించాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నియమాల ప్రకారం, 15 ఏళ్లకు పైగా లద్దాఖ్‌లో నివసిస్తున్నవారు, లేదా కనీసం 7 ఏళ్ల పాటు అక్కడ చదివినవారు మరియు 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షలు అక్కడే రాశినవారు స్థానికులుగా పరిగణించబడతారు.
Date : 03-06-2025 - 4:28 IST -
IPL 2025 Final : అహ్మదాబాద్‌లో వర్షం ఆటను అంతరాయం చేయనుందా? మౌసంను గురించి పూర్తీ సమాచారం
ఈసారి విజేతగా అవతరించాలనే ఉత్సాహంతో తుది పోరుకు దిగుతున్నాయి. అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది.
Date : 03-06-2025 - 4:10 IST -
Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఈ ముగ్గురిలో మాలిక్ ఇష్ఫాక్ నసీర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అజాజ్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వసీం అహ్మద్ ఖాన్ అనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి ఉన్నారు. వీరిపై ఉగ్రవాద సంస్థలకు సహకరించడం, ఆయుధాల రవాణా, ఉగ్ర కార్యకలాపాల్లో నేరుగా పాలుపంచుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Date : 03-06-2025 - 3:52 IST -
YS Jagan : తెనాలిలో వైఎస్ జగన్‌కు నిరసన సెగ
తెనాలికి సమీపంలోని ఐతా నగర్లో జగన్ రౌడీషీటర్లను పరామర్శించేందుకు వస్తున్నారన్న వార్తలపై ఈ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. దీనిపై నిరసనగా నల్ల బెలూన్లతో మండల కేంద్రంలో ప్రదర్శనలు నిర్వహించాయి.
Date : 03-06-2025 - 2:07 IST -
Canada : భారత్‌ను టార్గెట్ చేసేవారితో సంబంధాలు తెంచుకోవాలి: కెనడా మాజీ ప్రధాని
భారత్‌ను విభజించాలని లక్ష్యంగా పెట్టుకున్న శక్తులకు మద్దతు ఇవ్వడం కేవలం కెనడా అంతర్జాతీయ పరస్పర సంబంధాలను నాశనం చేయడమే కాకుండా, దేశ భద్రతకు కూడా ముప్పుగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 03-06-2025 - 1:56 IST -
Kamal Haasan : మీరేమైనా చరిత్రకారుడా?.. ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు : కమల్ హాసన్‌కు హైకోర్టు ప్రశ్న
ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రముఖ నటుడు కమల్ హాసన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "ఎంత పెద్ద నటుడైనప్పటికీ, ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనే హక్కు ఎవరికీ లేదు". కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనసు బాధించాయని కోర్టు అభిప్రాయపడింది.
Date : 03-06-2025 - 1:27 IST