HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Godavari Banakacharla Issue Two Cms To Meet Soon Minister Uttam Kumar

Uttam Kumar : గోదావరి-బనకచర్ల అంశం..త్వరలో ఇద్దరు సీఎంల భేటీ : మంత్రి ఉత్తమ్‌కుమార్‌

ఈ సమావేశంలో ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆందోళనలు, న్యాయపరమైన అంశాలను మంత్రి పాటిల్‌కు వివరించినట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించడమే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

  • Author : Latha Suma Date : 19-06-2025 - 3:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pranahita-Chevella Project
Pranahita-Chevella Project

Uttam Kumar : గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు చట్ట విరుద్ధమని తెలంగాణ రాష్ట్ర సాగునీటి పరిరక్షణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆందోళనలు, న్యాయపరమైన అంశాలను మంత్రి పాటిల్‌కు వివరించినట్లు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమంటే కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను విస్మరించడమే అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి పాటిల్‌ ఈ అంశాలను గమనించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Read Also: YS Sharmila: జగన్‌ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బల ప్రదర్శనలు కాదు: షర్మిల

ఈ సందర్భంగా కృష్ణా వాటాలపై నిర్ణయం తీసుకోవాల్సిన ట్రైబ్యునల్ తీర్పు త్వరగా రావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. తెలంగాణకు న్యాయం జరిగేలా, జలవివాదాల పరిష్కారానికి ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వెలువడేలా చూడమని విజ్ఞప్తి చేశాం అని పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ లింక్ ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్‌కు నీరు తరలించే అవకాశంపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇచ్చంపల్లి-సాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నాం. ఈ అంశంపై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య త్వరలో సమావేశం జరగేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు అని వెల్లడించారు.

కేంద్రం నుంచి ఇంకా అనుమతుల్లేక తెలంగాణలోని పలు ప్రాజెక్టులు ఆగిపోయినట్లు తెలిపారు. ఏపీ ప్రాజెక్టులకు మాత్రం వేగంగా అనుమతులు మంజూరు అవుతున్నాయి. ఇది స్తబ్దతకు గురైనతెలంగాణ ప్రాజెక్టుల పట్ల వివక్షకు నిదర్శనం అని ఆయన అన్నారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరాం. అలాగే పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క సారక్క, తుమ్మడిహట్టు వంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేపట్టాలని విజ్ఞప్తి చేశాం అని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ఇటువంటి ప్రాజెక్టుల విషయంలో సమానత్వంతో, న్యాయబద్ధంగా కేంద్రం నడుచుకోవాలని కోరారు. రాష్ట్రానికి వాటా వచ్చిన నీటిని ఉపయోగించుకోవడమే తమ హక్కు అని, ఇది కొంతమంది తప్పుగా భావిస్తే సహించేది కాదని హెచ్చరించారు.

Read Also: Baba Vanga Prediction : స్మార్ట్‌ఫోన్‌ యుగం తో సమస్యలు తప్పవని కొన్ని ఏళ్ల క్రితమే బాబా వంగా జోస్యం

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Banakacharla Project
  • Godavari-Banakacharla issue
  • Minister CR Patil
  • telangana
  • uttam kumar reddy

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd