TG : గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు..వెయ్యి టీఎంసీలు కావాలని చంద్రబాబును అడగటం ఏంటి?: హరీశ్‌రావు
అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలు నీటి హక్కు. అయినప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును వెయ్యి టీఎంసీల నీటిని అడగడం సరిగ్గా లేదు అని అన్నారు. కృష్ణా నదిలో 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నామంటే, కేవలం 500 టీఎంసీల కోసం అడగడం రాష్ట్ర హక్కులను తక్కువ చేయడమేనని వ్యాఖ్యానించారు.
- By Latha Suma Published Date - 06:30 PM, Thu - 19 June 25

TG : తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రముఖ నేత తన్నీరు హరీశ్‌రావు బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి మీటింగ్ పెట్టినట్టు ఉన్నదని ఆరోపించారు. గురువారం జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలు నీటి హక్కు. అయినప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును వెయ్యి టీఎంసీల నీటిని అడగడం సరిగ్గా లేదు అని అన్నారు. కృష్ణా నదిలో 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నామంటే, కేవలం 500 టీఎంసీల కోసం అడగడం రాష్ట్ర హక్కులను తక్కువ చేయడమేనని వ్యాఖ్యానించారు.
Read Also: Chandrababu : నీటి వనరుల వినియోగంపై వివాదాలు అవసరమా? : సీఎం చంద్రబాబు
అసలే ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ కొనసాగుతున్న సమయంలో, ముఖ్యమంత్రి తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుపై తీసుకుంటున్న నిర్ణయం రాష్ట్రానికి హానికరం అవుతుందన్నారు. తెలంగాణ జలాలపై నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. కానీ ఇప్పుడు జరిగేది పూర్తిగా తెలంగాణకు నష్టమే అని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనను గుర్తు చేస్తూ, హరీశ్ రావు మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్ నదుల అనుసంధానం గురించి క్లియర్ గా చెప్పారు. ఏపీతో కలిసి పనిచేయడంలో తప్పు లేదు కానీ, తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి ముందుకు వెళ్లకూడదని ఆయన హెచ్చరించారు. గోదావరి జలాలను నాగార్జునసాగర్ ద్వారా శ్రీశైలం వరకు తీసుకెళ్లాలని ప్రతిపాదన పెట్టారు.
ఇది తెలంగాణకు ప్రయోజనకరమని అప్పుడు కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కానీ జగన్ ఆ ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో, ఆ యోజన ముందుకు సాగలేదు అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకోసం ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని, కేంద్రంతోపాటు ఏపీతో చర్చల్లో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని హరీశ్ రావు సూచించారు. జలవనరుల విషయంలో తెలంగాణకు న్యాయం జరగాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణను నీటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దోచుకోకుండా, ప్రజల హక్కులను కాపాడే పోరాటం కొనసాగుతుందని” హరీశ్ రావు స్పష్టం చేశారు.
Read Also: Iran-Israel: ఖొమేనీని వదిలిపెట్టబోం.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు