Pawan Kalyan : అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవు : డిప్యూటీ సీఎం
ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు ఏవైనా కూడా ప్రభుత్వం సహించదని, అలాంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాటల స్వేచ్ఛ ఉందని కానీ అది చట్టాల పరిధిలో ఉండాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 01:58 PM, Fri - 20 June 25

Pawan Kalyan: రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రాధాన్యతనిస్తామన్న సంకేతాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంతనిచ్చారు. అసాంఘిక శక్తులు, అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేసే వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు ఏవైనా కూడా ప్రభుత్వం సహించదని, అలాంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాటల స్వేచ్ఛ ఉందని కానీ అది చట్టాల పరిధిలో ఉండాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సినిమాల్లో చెప్పే డైలాగులు స్క్రీన్ వరకు బాగుంటాయి. వాటిని నిజ జీవితానికి అన్వయించడమనేది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు అని వ్యాఖ్యానించారు. చట్టానికి లోబడి ప్రవర్తించాల్సిన అవసరం ప్రతి పౌరుడికీ ఉందని చెప్పారు.
Read Also: Bonalu Festival : బోనాల పండుగకు సిద్ధమవుతున్న భాగ్యనగరం..అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
అసాంఘిక శక్తుల ద్వారా ప్రజల్లో భయం, అనిశ్చితి కలిగించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో, పోలీసులను ఇప్పటికే ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని పవన్ కల్యాణ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు. అవసరమైతే రౌడీషీట్లు తెరిచి అణచివేస్తాం అని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సామాజిక శాంతిని కాపాడడమే తమ ప్రధాన బాధ్యత అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, చట్ట విరుద్ధంగా వ్యవహరించే వారిని గుర్తించాలన్నారు. అప్రజాస్వామిక ధోరణులవల్ల సమాజంలో తలెత్తే అవకాశం ఉందని, అది ఎవరికీ మేలు చేయదన్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, సాంఘిక మాధ్యమాల్లో ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ప్రజల భద్రతను కాపాడే విషయంలో ఈ ప్రభుత్వం సంకల్పబద్ధంగా ఉన్నదని ఆయన మాటల ద్వారా స్పష్టం అవుతోంది. ఇలాంటి దృఢమైన వ్యాఖ్యలు, ప్రభుత్వ కట్టుబాటు రాష్ట్రంలోని శాంతిని నిలబెట్టడంలో కీలకంగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడమే ప్రజాస్వామ్యానికి నిజమైన రక్షణ అని వారు భావిస్తున్నారు.