Krishna Janmashtami: రేపే కృష్ణాష్టమి.. పూజ ఎలా చేయాలంటే?
ఈ రోజున భక్తులు కృష్ణుడి లీలలు, కథలు చదువుకుంటూ జాగరణ చేస్తారు. ఇంకా పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి పండుగను జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ఊయల ఊపుతూ కృష్ణుడి పాటలు పాడతారు. కొన్ని చోట్ల ఉట్టి కొట్టే ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.
- Author : Gopichand
Date : 15-08-2025 - 9:42 IST
Published By : Hashtagu Telugu Desk
Krishna Janmashtami: కృష్ణాష్టమి (Krishna Janmashtami) పండుగను శ్రీకృష్ణుడు జన్మించిన రోజున జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం శ్రావణ మాసం బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు వస్తుంది. 2025లో కృష్ణాష్టమి ఆగస్టు 16 శనివారం నాడు వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో తిథి ఆధారంగా ఆగస్టు 15 రాత్రి కూడా వేడుకలు మొదలవుతాయి.
కృష్ణాష్టమి పూజా విధానం
కృష్ణాష్టమి రోజున భక్తులు ఉదయం నుండే ఉపవాసం ఉండి సాయంత్రం లేదా అర్ధరాత్రి శ్రీకృష్ణుడి జన్మ సమయానికి పూజలు చేస్తారు. పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Saliya Saman: శ్రీలంక మాజీ క్రికెటర్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం!
- స్నానం, శుభ్రత: ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసి, పూజ గదిని అలంకరించాలి. ఇంటి గడపలకు పసుపు, కుంకుమలు పెట్టి, బేబీ కృష్ణుడు నడిచి వస్తున్నట్టుగా పాదాలను చిత్రించుకోవాలి.
- విగ్రహాన్ని అలంకరించడం: బాలకృష్ణుడి విగ్రహాన్ని లేదా రాధాకృష్ణుల విగ్రహాన్ని శుభ్రం చేసి, పసుపు రంగు వస్త్రాలు, కొత్త ఆభరణాలతో అలంకరించాలి.
- పూజ ప్రారంభం: పూజ గదిలో ఒక మందిరం ఏర్పాటు చేసి, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఉంచాలి. ఐదు వత్తులతో దీపం వెలిగించి, ధూపం, అగరబత్తులు వెలిగించాలి.
- మంత్ర పఠనం: “ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
- నైవేద్యం: కృష్ణాష్టమికి ప్రత్యేకమైన నైవేద్యాలు సిద్ధం చేయాలి. వెన్న, పెరుగు, మీగడ, అటుకులు, పాలు, పంచదార మిశ్రమంతో చేసిన ప్రసాదాలు ముఖ్యంగా సమర్పిస్తారు.
- పూజ ముగింపు: రాత్రి 12 గంటలకు కృష్ణుడి జన్మ సమయానికి హారతి ఇచ్చి, భజనలు, కీర్తనలతో ఆరాధించాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని ముగించవచ్చు.
ఈ రోజున భక్తులు కృష్ణుడి లీలలు, కథలు చదువుకుంటూ జాగరణ చేస్తారు. ఇంకా పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి పండుగను జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ఊయల ఊపుతూ కృష్ణుడి పాటలు పాడతారు. కొన్ని చోట్ల ఉట్టి కొట్టే ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.