Trending
-
Financial Changes In July: జూలై నెలలో ఇన్ని మార్పులు రాబోతున్నాయా?
మీరు రైలులో తత్కాల్ టికెట్ బుక్ చేస్తే ఇప్పుడు ఈ ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉంటుంది. జూలై 1 నుండి IRCTC వెబ్సైట్, మొబైల్ యాప్‌లో తత్కాల్ టికెట్ బుక్ చేయడానికి ఆధార్ ధృవీకరణ తప్పనిసరి.
Published Date - 06:45 AM, Sun - 29 June 25 -
Tesla: ప్రపంచంలోనే తొలిసారి.. డ్రైవర్ లేకుండానే కారు డెలివరీ!
టెస్లా మోడల్ Yని అప్డేట్ చేసి ఫుల్లీ ఆటోనమస్ కారుగా తీర్చిదిద్దింది. దీనిని మొదటిసారిగా మార్చి 2019లో లాంచ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మోడల్ Y ధర 40,000 డాలర్లు (సుమారు 34 లక్షల రూపాయలు) నుండి ప్రారంభమవుతుంది.
Published Date - 11:26 PM, Sat - 28 June 25 -
PJR flyover : వాహనదారులకు ఊరట..పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఈ ఫ్లైఓవర్ సముదాయాన్ని 1.2 కిలోమీటర్ల పొడవుతో, ఆరు వరుసల (లేన్ల)తో, సుమారు 24 మీటర్ల వెడల్పుతో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద రోజూ ఎదురయ్యే తీవ్ర రద్దీ నుంచి విముక్తి కలిగించేందుకు ఇది కీలకంగా మారనుంది.
Published Date - 06:44 PM, Sat - 28 June 25 -
Telangana Police : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..
ఈ బదిలీల్లో భాగంగా పలువురు అధికారులకు ముఖ్యమైన నియామకాలు చేయడం గమనార్హం. వై. నాగేశ్వరరావును సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) కు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా నియమించారు.
Published Date - 06:23 PM, Sat - 28 June 25 -
Jagannath Rath Yatra : పూరీలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర
12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కి.మీ దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి వైభవంగా జరుపుతున్న ఈ రథయాత్రలో, భక్తులు స్వయంగా రథాలను లాగేందుకు పోటీ పడ్డారు.
Published Date - 05:13 PM, Sat - 28 June 25 -
Taliban : పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 16 మంది సైనికులు మృతి
పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వేగంగా నడుపుతూ సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. భారీ శబ్దంతో జరిగిన పేలుడుతో సైనిక వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.
Published Date - 04:49 PM, Sat - 28 June 25 -
Pawan Kalyan : మహా న్యూస్ చానల్ పై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఒక మీడియా సంస్థ కార్యాలయంపై భౌతికంగా దాడిచేయడం అత్యంత నిందనీయం. ఇది కేవలం ఆ సంస్థపై మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలపై కూడా దాడి చేసినట్టే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ఒక కీలక స్థంభం అని గుర్తుచేశారు.
Published Date - 04:33 PM, Sat - 28 June 25 -
Telangana : తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇప్పటికే రెండు రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకూ నోటిఫికేషన్ వెలువడగా, ఇప్పుడు మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం కూడా ప్రకటన విడుదల కావడం విశేషం. అభ్యర్థులు జూలై 10వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 04:15 PM, Sat - 28 June 25 -
Harish Rao : జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి ‘దగా క్యాలెండర్’ అమలు చేస్తున్నారు: హరీశ్ రావు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతలో ఆశలు నింపింది. జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు వద్దంటూ యువతే ఆందోళనలు చేస్తోందని అపప్రచారం చేస్తోంది.
Published Date - 03:52 PM, Sat - 28 June 25 -
IndiGo Monsoon Sale: విమాన ప్రయాణీకులకు బంపరాఫర్.. రూ. 1500కే ప్రయాణం, ఆఫర్ ఎప్పటివరకు అంటే?
ఈ ఆఫర్ పీరియడ్ సమయంలో ఎకానమీ క్లాస్ ఒకవైపు టిక్కెట్ ధర ఎంపిక చేసిన దేశీయ రూట్లపై కేవలం 1499 రూపాయలు, ఎంపిక చేసిన విదేశీ రూట్లపై 4,399 రూపాయలు ఉంటుంది.
Published Date - 12:20 PM, Sat - 28 June 25 -
Kolkata : లా విద్యార్థినిపై అత్యాచార ఘటన.. సెక్యూరిటీగార్డు అరెస్ట్
ఈ దారుణం వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి మధ్య ఓ ముఖ్య నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Published Date - 12:18 PM, Sat - 28 June 25 -
Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. తెరపైకి కవిత పీఏ పేరు
సిట్ ఆధికారులు తాజాగా ప్రాథమికంగా సేకరించిన ఆధారాల నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్లో నుండి బయటపడిన కొన్ని ఆడియో రికార్డింగులు దర్యాప్తును మరింత ఉత్కంఠతో నింపుతున్నాయి.
Published Date - 12:06 PM, Sat - 28 June 25 -
Anchor Sweccha Votarkar : మానసిక వేదింపులు తట్టుకోలేక యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య చేసుకుందా..?
Anchor Swetcha Votarkar : ఆమె మృతికి కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి. స్వేచ్ఛ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తన కుమార్తెతో పాటు పూర్ణచంద్రరావుతో సహజీవనం చేస్తోంది
Published Date - 11:58 AM, Sat - 28 June 25 -
PV Narasimha Rao : ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు : నేతల ఘన నివాళులు
"దేశం ఆర్థిక, రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ, దేశ దిశను మార్చిన వ్యక్తి. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు నేటి అభివృద్ధికి పునాది" అని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు తొలి తెలుగు ప్రధానిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక విధానాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారని చంద్రబాబు కొనియాడారు.
Published Date - 11:47 AM, Sat - 28 June 25 -
Telangana : జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
ఈ నెల 30వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. జూన్ 1 నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదే రోజున నామినేషన్ల పరిశీలన కూడా చేపట్టనున్నారు. అయితే పోటీ ఉంటే జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Published Date - 11:27 AM, Sat - 28 June 25 -
Post Offices: పోస్టాఫీసు వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు నుంచి ప్రారంభం!
ప్రస్తుతం పోస్టాఫీసులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించలేకపోతున్నాయి. ఎందుకంటే వాటి అకౌంట్లు యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సిస్టమ్‌తో సమకాలీకరణ కాలేదు.
Published Date - 11:05 AM, Sat - 28 June 25 -
Amit Shah : నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.
Published Date - 08:16 PM, Fri - 27 June 25 -
Kolkata : కోల్‌కతాలో మరో దారుణం.. న్యాయ విద్యార్థినిపై అత్యాచారం
పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న కక్షతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగానికి చెందిన నేత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి పోలీసులకు అందించిన ఫిర్యాదు ప్రకారం, టీఎంసీపీ (టీఎంసీ విద్యార్థి విభాగం) జనరల్ సెక్రటరీగా పనిచేసిన మనోజిత్ మిశ్రా (31) ఆమెపై పెళ్లి ఒత్తిడి తెచ్చాడు.
Published Date - 07:41 PM, Fri - 27 June 25 -
Vijaya Rama Raju : ఏపీ విద్యాశాఖ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నా, సంబంధిత అధికారులు నియామక ప్రక్రియను చేపట్టలేదు.
Published Date - 07:15 PM, Fri - 27 June 25 -
Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ కల్తీ అంశం.. సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక విచారణ నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ చేసిన ఈ నివేదిక రెండు రోజుల క్రితమే కోర్టుకు చేరింది. ఇందులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు, సాక్ష్యాల విశ్లేషణ, నిందితుల పట్ల తీసుకున్న చర్యలు వంటి అంశాలను సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం.
Published Date - 06:47 PM, Fri - 27 June 25