Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎంగేజ్‌మెంట్ రింగ్ లేకుండానే!
స్మృతి మంధాన వివాహం 2025 నవంబర్ 23న పలాష్ ముచ్చల్‌తో జరగాల్సి ఉంది. మెహందీ, సంగీత్, హల్దీ వేడుకలు అన్నీ ఘనంగా జరిగాయి. కానీ అకస్మాత్తుగా మంధాన తండ్రి అనారోగ్యంతో ఉన్నారనే వార్త వచ్చింది. కొద్దిసేపటికే పెళ్లి వాయిదా పడింది.
- By Gopichand Published Date - 09:30 PM, Fri - 5 December 25
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana), ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో కలిసి గత నెల నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే స్మృతి మంధాన తండ్రికి అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో పెళ్లి వాయిదా పడింది. కానీ కొద్ది రోజుల తర్వాత పలాష్ వేరే మహిళతో చాటింగ్ చేస్తున్నాడనే వార్తలు మొదలయ్యాయి. దీని కారణంగానే వివాహం వాయిదా పడిందని, పెళ్లి గురించి కొత్త అప్‌డేట్ ఏదీ రాలేదని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె చేతికి నిశ్చితార్థపు ఉంగరం కనిపించకపోవడం గమనార్హం.
మంధాన చేతి నుండి నిశ్చితార్థపు ఉంగరం మాయం
స్మృతి మంధాన తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకుంది. వాస్తవానికి మంధాన కోల్‌గేట్‌తో కలిసి ఒక వాణిజ్య ప్రకటన (అడ్వర్టైజ్‌మెంట్) చేసింది. ఆ వీడియోను ఆమె తన వ్యక్తిగత ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మంధాన చేతులకు నిశ్చితార్థపు ఉంగరం కనిపించకపోవడాన్ని అభిమానులు గమనించారు. అయితే ఈ వీడియోపై అభిమానులు రకరకాల స్పందనలు కూడా తెలియజేశారు. ఈ వీడియో కామెంట్లలో అభిమానులు తమ స్పందనలను పంచుకుంటున్నారు.
Also Read: Nail Rubbing: మీకు ఈ అలవాటు ఉందా? రోజుకు 5 నిమిషాలు ఇలా చేస్తే చాలు!!
Smriti Mandhana breaks silence with Instagram post after wedding postponement. Fans notice missing engagement ring, cheating rumors remain unaddressed by couple.
Read more on https://t.co/b6k9wTBZsI#SmritiMandhana #palashmuchhal #Wedding #EngagementRing #CricketUpdates… pic.twitter.com/duRngz5LD1
— shorts91 (@shorts_91) December 5, 2025
ఒక యూజర్ “ఈమె ఎందుకు విచారంగా కనిపిస్తోంది.. ఆమె నవ్వుతోంది. కానీ ఆమె కళ్ళు, గొంతులో విచారం కనిపిస్తోంది” అని రాశారు. మరొకరు “నిశ్చితార్థపు ఉంగరం లేదు” అని రాశారు. ఇంకొక యూజర్ “ఈ యాడ్ పెళ్లి తేదీ కంటే ముందు షూట్ చేసినది కావచ్చు” అని అభిప్రాయపడ్డారు. అయితే ఈ వీడియోను ఎప్పుడు షూట్ చేశారనే విషయంపై స్పష్టత లేదు.
మంధాన పెళ్లి ఎందుకు వాయిదా పడింది?
స్మృతి మంధాన వివాహం 2025 నవంబర్ 23న పలాష్ ముచ్చల్‌తో జరగాల్సి ఉంది. మెహందీ, సంగీత్, హల్దీ వేడుకలు అన్నీ ఘనంగా జరిగాయి. కానీ అకస్మాత్తుగా మంధాన తండ్రి అనారోగ్యంతో ఉన్నారనే వార్త వచ్చింది. కొద్దిసేపటికే పెళ్లి వాయిదా పడింది. అయితే మరుసటి రోజు పలాష్ వేరే మహిళతో జరిపిన చాట్ వైరల్ అవ్వడం మొదలైంది. దీని తర్వాతే పలాష్ స్మృతిని చీట్ చేశాడని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వివాహం ఎప్పుడు జరుగుతుంది? వాయిదా పడటానికి అసలు కారణం ఏమిటి? అనే దానిపై ఎటువంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.