Trending
-
Shubhanshu Shukla : నేను ఒంటరి కాను.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడు..అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా లైవ్‌కాల్
ఇక్కడ ఉన్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై భారత త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తే, నేను ఒంటరిగా రాలేదన్న భావన కలుగుతోంది. కోట్లాది మంది భారతీయుల ఆశలు నా వెంట ఉన్నాయి. ఈ చిన్న అడుగు నాది కావచ్చు, కానీ ఇది భారత మానవ అంతరిక్ష ప్రయాణాల దిశగా వున్న ఒక గొప్ప ముందడుగు అని భావోద్వేగంగా మాట్లాడారు.
Published Date - 01:29 PM, Thu - 26 June 25 -
Akhanda Godavari Project : డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఇది అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపించేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలో ప్రారంభమైన అఖండ గోదావరి ప్రాజెక్టు రాష్ట్రానికి భారీ ప్రయోజనాలు కలిగించనుందని షెకావత్ అన్నారు.
Published Date - 01:01 PM, Thu - 26 June 25 -
Akhanda Godavari Project : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యటక కేంద్రాలకు పునరుజ్జీవం: పవన్ కల్యాణ్
ఇది నాగరికతకు నిలయం. గోదావరి తీరం వెంట భాష, సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది సాంస్కృతికంగా విలువైన భూమి అని ఆయన అన్నారు.ఈ ప్రాంతం ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన మట్టిది.
Published Date - 12:03 PM, Thu - 26 June 25 -
Kanakadurga Temple : ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వారాహి ఉత్సావాలు..అమ్మవారికి తొలి సారె
అమ్మవారికి సమర్పించిన సారెల్లో పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు వంటి విశిష్ట వస్తువులు ఉన్నాయి. అలాగే అమ్మవారికి శేష వస్త్రాలను కూడా వినయపూర్వకంగా సమర్పించారు. ఆలయ ఉద్యోగులు, పూజారులు మరియు విశేష భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Published Date - 11:49 AM, Thu - 26 June 25 -
Kakani Govardhan reddy : రెండో రోజు సిట్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి
నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనను, కోర్టు అనుమతితో గురువారం ఉదయం అధికారులు బయటకు తీసుకెళ్లారు. అనంతరం కాకాణిని కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Published Date - 11:25 AM, Thu - 26 June 25 -
Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోలు మృతి
. ఈ ఆపరేషన్‌కి సంబంధించి అధికారిక వివరాల ప్రకారం, అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టుల మాడ్ డివిజన్‌కు చెందిన సీనియర్ కేడర్ సభ్యులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
Published Date - 11:03 AM, Thu - 26 June 25 -
Balance Check: ఒకే క్లిక్‌తో మొత్తం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
గతంలో యూజర్లు ప్రతి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను విడిగా తనిఖీ చేసి, మొత్తం డబ్బును మాన్యువల్‌గా లెక్కించాల్సి వచ్చేది. ఈ ఫీచర్‌తో యూజర్లు పేటీఎం యూపీఐ పిన్ వెరిఫికేషన్ తర్వాత అన్ని అకౌంట్ల మొత్తం బ్యాలెన్స్‌ను తక్షణమే చూడగలరు.
Published Date - 10:55 AM, Thu - 26 June 25 -
America : విమానం గగనతలంలో ఉండగా ఇంజిన్‌లో మంటలు..భయాందోళనలో ప్రయాణికులు
ఈ ఘటన బుధవారం ఉదయం అమెరికా కాలమానం ప్రకారం చోటుచేసుకుంది. లాస్‌వేగాస్ ఎయిర్‌పోర్టు నుంచి నార్త్ కరోలినాలోని ఛార్లట్‌కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక సమస్యను ఎదుర్కొంది.
Published Date - 10:47 AM, Thu - 26 June 25 -
Uttarakhand : అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. మరో 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఘోల్తీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇది రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వతాల మధ్య నదీ పరివాహక ప్రాంతంగా ఉంటుంది.
Published Date - 10:30 AM, Thu - 26 June 25 -
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది? స్పోర్ట్స్ హెర్నియా అంటే ఏమిటి?
ఐపీఎల్ 2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కోసం లండన్ వెళ్లాడు. ఇప్పుడు సూర్యకుమార్ స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ విజయవంతంగా పూర్తయింది.
Published Date - 09:56 AM, Thu - 26 June 25 -
American Airlines Flight : మరో విమాన ప్రమాదం కలకలం..గాల్లోనే మంటలు
American Airlines Flight : ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఘటనను ‘మెకానికల్ ఇష్యూ’గా అభివర్ణించింది. అయితే ఇంజన్లో మంటల ఆనవాళ్లు కనిపించలేదని వారి నిర్వహణ బృందం స్పష్టం చేసింది.
Published Date - 07:21 AM, Thu - 26 June 25 -
Telangana : బోనాల ఉత్సవాలకు రూ.20కోట్లు మంజూరు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ నిధులు నగరంలోని మొత్తం 2,783 ఆలయాలకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు, అవసరమైన ఏర్పాట్లకు చెక్కుల రూపంలో విడుదల చేసినట్టు మంత్రి వివరించారు. దేవాలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రతి ఆలయంలో ఉత్సవాలు విజయవంతంగా జరగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
Published Date - 05:55 PM, Wed - 25 June 25 -
CBSE : ఇక పై ఏడాదిలో రెండు సార్లు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు..
ఈ నూతన విధానం విద్యార్థులకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. CBSE పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరిలో, రెండవ విడత పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు.
Published Date - 05:39 PM, Wed - 25 June 25 -
TS LAWCET 2025 : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల..
జూన్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించబడ్డాయి. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, లా కాలేజీల్లో ఎల్ఎల్బీ (3, 5 ఏళ్ల) మరియు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి.
Published Date - 05:10 PM, Wed - 25 June 25 -
Pakistan : భారత్‌తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని
ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది.
Published Date - 05:01 PM, Wed - 25 June 25 -
Shubhanshu Shukla : మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది: ప్రధాని మోడీ
భారత వ్యోమగామిగా, గ్రూప్ కెప్టెన్‌గా అంతరిక్షానికి పయనమైన శుభాంశు శుక్లా, భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచారు. ఇది దేశానికి గర్వకారణమైన ఘట్టం. ఆయన భాగంగా ఉన్న యాక్సియం-4 మిషన్ ప్రపంచానికి ఒకటే కుటుంబమని తెలియజేస్తోంది.
Published Date - 04:40 PM, Wed - 25 June 25 -
Rain : హైదరాబాద్‌లో మధ్యాహ్నం వర్ష బీభత్సం..ట్రాఫిక్‌కు అడ్డంకులు, వాహనదారులకు ఇబ్బందులు
అయితే ఈ సడెన్ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బేగంపేట, ఎల్బీనగర్, అమీర్‌పేట్ వంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయింది.
Published Date - 02:33 PM, Wed - 25 June 25 -
Chandrababu : ఆధునిక సాంకేతికతకు మోడల్‌గా అమరావతి : సీఎం చంద్రబాబు
ఐటీ రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మన జీవన విధానంలో భాగంగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో ఇప్పటికే పోలీస్ విభాగం రాత్రి పట్రోలింగ్ నిర్వహిస్తోంది.
Published Date - 02:08 PM, Wed - 25 June 25 -
AP Govt : 2027 గోదావరి పుష్కరాలకు సిద్ధం అవుతున్న ఏపీ ప్రభుత్వం..ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి (సీఎస్) కేఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మొత్తం 12 మంది మంత్రులు సభ్యులుగా నియమితులయ్యారు.
Published Date - 01:50 PM, Wed - 25 June 25 -
Shubhanshu Shukla : అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా సందేశం..మీరంతా నా వెంటే
నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత భారతదేశం మళ్లీ అంతరిక్షాన్ని తాకింది. ఇది కేవలం నా ప్రయాణం కాదు భారత మానవ సహిత రోదసి యాత్రకు ఇది ప్రారంభ ఘట్టం. నా భుజాలపై ఉన్న త్రివర్ణ పతాకం చూస్తుంటే, మీ అందరి ఆశీస్సులు నాతో ఉన్నాయనే గర్వం కలుగుతోంది.
Published Date - 01:35 PM, Wed - 25 June 25