KTR : కేటీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తా..!
KTR : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోవడం, నేతల ఫిరాయింపులు, పార్టీ శ్రేణుల్లో నిరాశ వంటి వాటి నుంచి నూతన ఉత్సహాన్ని తెచ్చేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
- By Latha Suma Published Date - 01:04 PM, Fri - 1 November 24

Padayatra : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా నేను తెలంగాణ వ్యాప్తంగా పాదయ్రాత చేస్తానని వివరించారు. పాదయాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. కాగా 2025లో కేసీఆర్ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండబోతున్నారని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోవడం, నేతల ఫిరాయింపులు, పార్టీ శ్రేణుల్లో నిరాశ వంటి వాటి నుంచి నూతన ఉత్సహాన్ని తెచ్చేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపంగా మారిందని కేటీఆర్ విమర్శులు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవు… అందుకే అబద్ధాల మీద, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదన్నారు. కేటీఆర్ అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేమన్నారు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించింది అన్నారు. అయితే వీటికి భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్ గా మారిందని కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.
ఇకపోతే..పాదయాత్రలు తెలుగు రాజకీయాల్లో అత్యంత ప్రభావితం చూపిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహాప్రస్థానం పేరిట 1,470 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. ఈ పాదయాత్రతో పదేళ్ల తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు సైతం ‘మీకోసం’ పేరుతో పాదయాత్ర చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
Read Also:Samantha : రాజస్థాన్ ఫోర్ట్ లో సమంత దీపావళి సెలబ్రేషన్స్..!