HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ktr Serious Comments On Cm Revanth Reddy

KTR : గాలి మోటర్లలో మూటలు మోసుడు కాదు.. ధాన్యం మూటల వైపు చూడు: కేటీఆర్‌

KTR : ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు..పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడుమన్నారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు..ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడాలని కేటీఆర్‌ సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.

  • Author : Latha Suma Date : 06-11-2024 - 5:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR Serious Comments On CM Revanth Reddy
KTR Serious Comments On CM Revanth Reddy

CM Revanth Reddy : బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గుట్టలను మట్టిచేసే భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్…. గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడని ట్విటర్ వేదికగా కేటీఆర్ విమర్శించారు. గాలిమోటర్లలో మూటలు మోసుడు కాదు..కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడాలన్నారు. ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు..పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడుమన్నారు. నీ కల్లబొల్లిమాటలతో కాలయాపన చేయడం కాదు..ధాన్యం కొనడానికి ముందుకు రాని మిల్లర్ల ముచ్చటేందో చూడాలని కేటీఆర్‌ సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.

నీ మూసి ముసుగులు కాదు..కల్లంలో కాంటా ఎప్పుడు వేస్తారో తెలియక కన్నీరు పెడుతున్న రైతన్నల కన్నీళ్ల వైపు చూడలని విమర్శించారు. పొద్దు, మాపు ఢిల్లీ యాత్రలు కాదు..పల్లె పల్లెల్లో, వాడ వాడల్లో వడ్లు కొనండి మొర్రో అంటూ మొత్తుకుంటున్న రైతు ఆవేదన వైపు చూడాలన్నారు. నీ కాసుల కక్కుర్తి..నీ కేసుల కుట్రలు కాదు..పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కక కకావికలం అవుతున్న రైతు బతుకు వైపు చూడమన్నారు. దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొడితివి..సన్నవడ్లకు సున్నం పెడితివి.. ఎగ్గొట్టడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు ఆసరాగా నిలవడం వైపు చూడాలని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఎద్దేవా చేశారు.

గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదు రేవంత్ – గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడు

గాలిమోటర్లో మూటలు మోసుడు కాదు – కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడు

ఢిల్లీ ముందు మోకరిల్లడం కాదు – పండించిన పంటకు భద్రత లేక గొల్లుమంటున్న రైతన్నల మొహం వైపు చూడు

నీ… pic.twitter.com/2tRcMb5A9A

— KTR (@KTRBRS) November 6, 2024

అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది బీఆర్‌ఎస్‌ అని రేవంత్‌రెడ్డికీ తెలుసని, తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతికార చర్యలంటూ పిచ్చి ఆలోచనలు చేయలేదని, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టామని కేటీఆర్ చెప్పారు. గతంలో బంగారం, బ్యాంకు డిపాజిట్లు చేసే వర్గాలు భూమి మీద పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాయని, ఇప్పుడు ఆ వర్గాల వాళ్లంతా ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, నల్లగొండలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముందు కొందరు నాయకులు అసహనం వ్యక్తం చేశారన్నారు. రియల్టర్ల ఇబ్బందులపై అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. రెరాను సంప్రదిస్తూ లీగల్‌ ఓపినియన్‌ తీసుకొని రియల్టర్ల ఫోరం మరింత బలపడాలని కేటీఆర్‌ సూచించారు.

Read Also: PM Vidyalaxmi : ‘పీఎం – విద్యాలక్ష్మి’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఏమిటీ స్కీం ? ఎవరు అర్హులు ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • congress
  • crop procurement
  • ktr
  • telangana

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd