KTR : సింగరేణి కార్మికులకు ఇచ్చింది బోనస్ కాదు..బోగస్: కేటీఆర్
Singareni workers : కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో వాటా 20 శాతానికి మించలేదని చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు.
- By Latha Suma Published Date - 03:44 PM, Sun - 22 September 24

Singareni workers: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు.. బోగస్ అని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో వాటా 20 శాతానికి మించలేదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సింగరేణి ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు.
Read Also: Samsung Galaxy S24: శాంసంగ్ ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్.. పూర్తి వివరాలు ఇవే!
”అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే సింగరేణిలో రూ.1,060 కోట్ల లాభాలు తీసుకొచ్చాం. 2014-15లో 102 కోట్లకు పైగా కార్మికులకు ఇచ్చాం. 2018-19లో రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి. ఆ ఏడాది ఒక్కో కార్మికుడికి రూ.లక్ష ఇచ్చాం. 2014లో రూ.17 వేలు ఇస్తే.. పదేళ్లలో లాభాలు పెంచి 2023 నాటికి 1.60 లక్షలు అందజేశాం. ప్రభుత్వం శనివారం ప్రకటించింది దసరా బోనస్ కాదు.. బోగస్. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1.80 లక్షల నష్టం కలిగే పరిస్థితి వచ్చింది. దీనిపై సీఎం నేరుగా సమాధానం చెప్పాలి. డిప్యూటీ సీఎం రూ.4,701కోట్ల లాభాలు వచ్చాయని చెప్పారు. అందులో 33 శాతం వాటా (రూ.1,551కోట్లు) కార్మికులకు ఇచ్చామన్నారు. కార్మికుడికి 33 శాతం వాటా ఇస్తే ఒక్కొక్కరికి రూ.3.70లక్షల లాభం రావాలి. కానీ ప్రభుత్వం రూ.1.90లక్షలు మాత్రమే బోనస్‌గా ప్రకటించడాన్ని ఎలా చూడాలి? 16.2శాతం లాభాల్లో వాటాగా ఇస్తూ 33 శాతం అని మభ్యపెడుతున్నారు. సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్‌ను గెలిపించింది. వాళ్లకు మీరిచ్చే బహుమతి ఇదా? కేంద్రంలో ఉన్నబీజేపీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోంది.. కాంగ్రెస్ దానికి సహకరిస్తోంది. కార్మికులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది.” అని కేటీఆర్ అన్నారు.