Hydra : హైడ్రా కూల్చివేతలు..సీఎస్ శాంతి కుమారి కీలక సమావేశం
హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు.
- By Latha Suma Published Date - 01:44 PM, Thu - 29 August 24

Hydra: హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిఎస్ ఈ సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్డడాలను హైడ్రా ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. యుద్ధ ప్రాతిపదికన అక్రమ కట్టడాల కూల్చివేతలు శరవేగంగా కొనసాగుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నేపథ్యంలోనే పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అన్ని నిబంధలను పక్కాగా అమలు చేసినా హైడ్రా అధికారులు కట్టడాలను కూలుస్తున్నారంటూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.దీంతో రూల్స్ మేరకే నడుచుకోవాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది.
దీంతో హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీఎస్ శాంతికుమారి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ నీటి పారుదల శాఖ అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో భేటీ అయ్యారు. హైడ్రా తన పని తను చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా చూడాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
కాగా, హైదరాబాద్ లోని నాలాలు, చెరువులను కబ్జాల నుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సొంత కుటుంబ సభ్యలు ఉన్నా.. ఎంతటి వారున్నా.. అక్రమ కట్టడాలు అని తేలితే వదిలి పెట్టమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే నగరంలో నాలాలను కబ్జా చేసి కట్టిన పలు కట్టడాలను అధికారులు కూల్చేశారు.
Read Also: MP Sushmita Dev : అస్సాంలో 27 లక్షల మంది ఆధార్ కార్డులు కోల్పోయారు..