HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Hydra Clarification About Rumors Regarding Ventures Near Lakes

Hydra : చెల్లుబాటయ్యే.. అనుమతులున్న నిర్మాణాలను కూల్చివేయం: హైడ్రా ప్రకటన

Hydra : ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసినవారికి మాత్రమే హైడ్రా ఒక భూతం లాంటిదని, వారి పట్ల ఒక అంకుశంలాగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.

  • Author : Latha Suma Date : 20-10-2024 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
HYDRA
HYDRA

Hydra Commissioner Ranganath : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టబద్ధమైన అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చెరువుల వద్ద అనుమతులు ఉన్నా.. నిర్మాణాలు కూల్చివేస్తారని తమపై ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న నిర్మాణాలు ముట్టుకోమని సీఎం చెప్పారాని.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని రంగనాథ్ స్పష్టం చేశారు.

కాగా.. శనివారం హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసినవారికి మాత్రమే హైడ్రా ఒక భూతం లాంటిదని, వారి పట్ల ఒక అంకుశంలాగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలను మాత్రం ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి అండగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవనం వేర్వేరు అంశాలని నొక్కిచెప్పారు. ఇప్పటివరకు మూసీ పరిసరాల్లో కూల్చివేతలే జరగలేదని, హైడ్రా అటువైపు వెళ్ళనే లేదన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు వారి ఫామ్ హౌజ్‌లను కాపాడుకోడానికే పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయడానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మూలాలను అస్థిరం చేయడానికి ఆ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. హైడ్రా ఆగదు.. ఆక్రమార్కులకు నిద్ర ఉండదు.. అని సీఎం రేవంత్ నొక్కిచెప్పారు.

హైదరాబాద్ లో చెరువులు, పార్కలు కజ్జాకు గురి కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా అనుకున్నట్లుగానే పని చేస్తోంది. ఇప్పటికే పలు చోట్ల చెరువులు, నాళాలను ఆక్రమించుకుని కట్టిన కట్టడాలను కూల్చేశారు. అలాగే చెరువులు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మిస్తున్న కట్టడాలను కూడా నేలమట్టం చేశారు. ఇక సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ లోని కొంత భాగాన్ని పడగొట్టారు. అలాగే చాలా చోట్ల కూల్చివేతలు చేపట్టడంతో బాధితులు హైడ్రాపై తీవ్రంగా మండిపడ్డారు. అయితే హైడ్రా కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటుంది. ఈ మధ్య ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. వ్యతిరేకత వస్తుందని.. సైలెంట్ అయిందా లేక ఇతర కారణాలతో సైలెంట్ అయిందో తెలియరావడం లేదు. అయితే హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాల క్రితం చాలా చెరువులు ఉండేవి. అయితే చెరువులు కబ్జా చేస్తూ వెంచర్లు వేస్తూ.. చెరువులు లేకుండా చేశారు. మిగిలిన చెరువులు కూడా కాపాడుకోవాలనే హైడ్రాను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు.

Read Also: Elon Musk: రోజూ ఒక ఓటరుకు రూ.8 కోట్లు.. ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Orders
  • CM Revanth Reddy
  • hyderabad
  • hydra
  • Hydra Commissioner Ranganath
  • lake ventures
  • Permissions
  • real estate

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd