Food poisoning : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అరెస్టు
తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య ని ఖూనీ చేశారాని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాడితే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది కాకుండా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు.
- By Latha Suma Published Date - 02:52 PM, Thu - 12 December 24

vikarabad Food poisoning : వికారాబాద్ జిల్లా తాండూర్‌లో ఎస్టీ హస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చెన్నారెడ్డి కూడా లేవద్దా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశం సారం శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా వికారాబాద్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సీఐ భీమ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సైలు అరుణ్ కుమార్ శ్రీనివాస్ తదితరులు మాజీ మంత్రుల వాహనాలను అడ్డుకొని ముందస్తు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు సవిత ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య ని ఖూనీ చేశారాని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాడితే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది కాకుండా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ..వారు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం వారిని పోలీసులు అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాజీ బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద పటేల్ కౌన్సిలర్ అనంతరెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్‌లో మంగళవారం పుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే. ఉదయం ఉడకని కిచిడీ తిని 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో విషయం తెలుసుకున్న ఎమ్మార్వో తారాసింగ్, మండల విద్యాధికారి వెంకటయ్య హాస్టల్‌కు వెళ్లి విచారించారు. హాస్టల్‌లో ఇబ్బందులు పడుతున్నామని పలువురు బాలికలు వారి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు నివేదిక అందిస్తామని అధికారులు వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.