HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Governments No Tax Policy Has Boosted Evs

Electric-Vehicles : తెలంగాణ సర్కార్ ‘నో ట్యాక్స్’​ విధానంతో జోరందుకున్న ‘ఈవీవాహనాలు’

Electric Vehicles : రోడ్డు పన్ను రద్దుతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

  • Author : Sudheer Date : 12-12-2024 - 2:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Electric Vehicles
Electric Vehicles

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric Vehicles) రోడ్డు పన్ను (Road Tax) పూర్తిగా రద్దు చేయాలని ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. రోడ్డు పన్ను రద్దుతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.  ఈ మాఫీ విధానం రెండు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, టాక్సీలు, ఆటో రిక్షాలు, లైట్ గూడ్స్ కేరియర్స్, ట్రాక్టర్లు, బస్సుల తదితర అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై వర్తిస్తుంది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రకటించారు. ఈ విధానం 2026 డిసెంబరు 31 వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో గాలితో కూడిన కాలుష్యాన్ని నివారించడానికి ఎలక్ట్రిక్ వాహనాల ఆవాహనాన్ని పెంచే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో ప్రతి 100 వాహనాలలో 5 వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు తయారీదారులు ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నాలుగు ఇతర రాష్ట్రాలను సందర్శించి వారి విధానాలను పరిశీలించారు. ఆ రాష్ట్రాల నుండి మంచి విధానాలను తీసుకొని, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసారు. ఈ విధానం ఢిల్లీ వంటి నగరాల్లో ఎదుర్కొనే కాలుష్య సమస్యలను నివారించడానికి అవసరమని ప్రభుత్వం పేర్కొంది.

ఇప్పటికే 2020-2030 మధ్యకాలం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని ప్రకటించింది. కానీ, ఆ విధానం పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. ప్రస్తుతం, ప్రభుత్వం ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సంకల్పించింది. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఈవీ పాలసీ వాహనదారుల్ని ఆకర్షిస్తుండడంతో కార్లు, ఆటోలు, మోటార్‌ సైకిళ్ల కొనుగోలు క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నెల 3 వరకు సుమారు 16 రోజుల్లోనే 3 వేల 372 ఎలక్ట్రిక్‌ వాహనాలు రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్టర్‌ అయ్యాయి.

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా రవాణాశాఖ విజయాల్లో భాగంగా ఈవీ రిజిస్ట్రేషన్ల వివరాల్ని రాష్ట్ర సర్కార్​ వెల్లడించింది. డిసెంబర్​ 9 నుంచి ఇప్పటివరకు 78 వేల 262 కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయని రవాణాశాఖ తెలిపింది. అంతకముందు ఏడాదిలో 51,934 ఈవీల రిజిస్ట్రేషన్‌ జరిగిందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంతో పోలీస్తే తమ ఏడాది పాలనలో ఈవీల రిజిస్ట్రేషన్లు 52.28 శాతం పెరిగాయని తెలిపింది.

Read Also : World Most Expensive Cars: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు ఏవి.. వాటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Electric Vehicles
  • minister ponnam prabhakar
  • road tax
  • telangana govt

Related News

    Latest News

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

    Trending News

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

      • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd