HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Food Checking Labs In Tirupati And Kurnool Ap Govt Agreement With Fssai

FSSAI : ఆహార నాణ్యత పరీక్షల కోసం తిరుమల, కర్నూలులో ల్యాబ్‌ల ఏర్పాటు..

FSSAI : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతి, కర్నూలులో ఆహార భద్రత, ప్రమాణా నిర్ధారణ కోసం స్పెషల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

  • Author : Latha Suma Date : 08-10-2024 - 8:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Food checking labs in tirupati and kurnool ap govt agreement with fssai
Food checking labs in tirupati and kurnool ap govt agreement with fssai

Food checking labs : ఏపీలో ఆహార భద్రత పెంపొందించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI)తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఆహారం కల్తీపై పరీక్షలు చేసి నాణ్యత నిర్ధారించేందుకు ల్యాబ్ లు ఏర్పాటు చేయడానికి ఫుడ్ చెకింగ్ సంస్థ అంగీకరించింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతి, కర్నూలులో ఆహార భద్రత, ప్రమాణా నిర్ధారణ కోసం స్పెషల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. తిరుపతి లడ్డూ కల్తీ అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి చివరికి సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థను కాదని, సీబీఐతో దర్యాప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

Read Also: J&K, Haryana Election Results : J&K, హరియాణా ఫలితాల పై కేటీఆర్ రియాక్షన్

ప్రధానంగా ఏపీలో ఆహార పరీక్షల ప్రయోగశాలలు ఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ సుముఖత వ్యక్తం చేసింది. రూ. 20 కోట్లతో తిరుమలలోనూ, మరో రూ.20 కోట్లతో కర్నూలులోనూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌లను నెలకొల్పేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే ఏలూరు, ఒంగోలులలో ప్రాథమిక ఆహార పరీక్షల ప్రయోగశాలల్ని ఒక్కొక్కటి రూ. 7.5 కోట్లతో మొత్తం రూ.13 కోట్లతో నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో ఆహార శాంపిళ్ల సేకరణ, విశ్లేషణ కోసం రూ.12 కోట్లు, ఆహార భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రూ.11 కోట్లు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబరెటరీలతో పాటు అదనంగా మరో 22 ల్యాబరెటరీలను టర్న్ కీ విధానంలో వినియోగించేందుకు రూ.15 కోట్లు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది.

Read Also: Congress : హర్యానాలో ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదు: కాంగ్రెస్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Govenrment
  • Food checking labs
  • fssai
  • kurnool
  • Minister Satyakumar
  • tirumala

Related News

116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

తిరుమల శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో 116 ఏళ్ల వయసులో ఒక బామ్మ కాలినడకన కొండ ఎక్కింది. యువకులు సైతం ఆయాసపడే మెట్ల మార్గంలో ఆమె ఏ మాత్రం అలసట లేకుండా నడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 116 ఏళ్ల వయసులోనూ కాలినడకన తిరుమల మెట్లు ఎక్కిన ఓ వృద్ధురాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యువతకే సవాలుగా మారుతున్న ఈ ప్రయాణాన్ని ఆమె

    Latest News

    • Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd