vinesh phogat : వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు..ప్రధాని మోడీ స్పందన
వినేశ్, నువ్వు చాంపియన్లకే చాంపియన్..ప్రధాని మోడీ
- Author : Latha Suma
Date : 07-08-2024 - 2:11 IST
Published By : Hashtagu Telugu Desk
vinesh phogat : పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫెనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్ పతకం సాధిస్తుందని భారత అభిమానులకు ఎదురు చేశారు. కానీ అధిక బరువు కారణంగా ఫెనల్‌కు ముందే ఆమె పై అనర్హత వేటను విధించారు ఒలింపిక్స్ నిర్వాహకులు. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాములు అధిక భరువు ఉండటంతో అనర్హురాలిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వినేశ్ ఫోగట్ డిస్‌క్వాలిఫై అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వినేశ్, నువ్వు చాంపియన్లకే చాంపియన్ అంటూ ఆయన ఎక్స్ అకౌంట్‌లో కామెంట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
”వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్! నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నాం” అని మోడీ భరోసానిచ్చారు. వినేశ్ విషయంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. అసలు ఏం జరిగిందో ఆయన అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం వద్ద తమ నిరసన వ్యక్తం చేయాలని పీటీ ఉషను మోడీ కోరినట్లు తెలుస్తోంది.