Naga Panchami 2024: నాగపంచమి ఎప్పుడు.. ఎలాంటి నియమాలు పాటించాలో మీకు తెలుసా?
నాగ పంచమి రోజున భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలి. ఆరోజున ఏం చేయాలి అన్న విషయాలను వివరించారు.
- By Anshu Published Date - 02:00 PM, Wed - 7 August 24

శ్రావణ మాసంలో జరుపుకునే పండుగలలో నాగపంచమి కూడా ఒకటి. దీన్నే నాగుల చవితి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నాగుల చవితి పండుగ రోజున పుట్టకు లేదంటే నాగుల కట్టకు పాలు పోసి చలివిడి వంటివి నైవేద్యంగా సమర్పించి నాగదేవతకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. కాగా నాగపంచమి పండుగను అనాదీగా జరుపుకుంటూ వస్తున్నారు. అలా ఈసారి నాగ పంచమి పండుగ ఆగస్టు 9 శుక్రవారం వచ్చింది. ఈ రోజున పుట్టల దగ్గరకు వెళ్లి పాలు పోయాలని చెబుతుంటారు. జంట నాగుల విగ్రహాల మీద పాలు పోయాలి.
సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్లాలి. నవనాగుల స్తోత్రాలను చదవాలని చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈ నాగుల పంచమి రోజున మహిళలు భక్తితో ఉపవాసం ఉండాలట. ఇక నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం కూడా చేస్తుంటారు. అలాగే నాగ దేవతకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయాలని చెబుతున్నారు. ఇక పుట్ట దగ్గరికి వెళ్లి భక్తితో నమస్కరించాలి. పుట్టకు పాలు పోసేవారు అతిగా అంటే ఎక్కువగా పాలు పోయకూడదట. మరి ముఖ్యంగా కాళ్ల సర్ప దోషం ఉన్నవారు ఈ నాగపంచమి రోజున నాగ ప్రతిష్టాపన చేయించుకోవాలని, అలాగే నాగ పూజ చేయించుకుంటే పిల్లలు తొందరగా అవుతాయని చెబుతున్నారు పండితులు.
నాగపంచమి రోజున చేసే ఏపూజ అయిన, వ్రతమైన కూడా వెయ్యిరెట్లు ఫలితం ఇస్తుందట. అందుకే నాగ పంచమి రోజు తప్పనిసరిగా పైన చెప్పిన నియమాలను విధిగా పాటించాని దీంతో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. అలాగే నాగ పంచమి రోజున పుట్టకు పాలు పోసిన తర్వాత తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్లాలని చెబుతున్నారు.