Telangana Debts: తెలంగాణ అప్పులపై ఆర్థిక మంత్రి నిర్మల కీలక వ్యాఖ్యలు
‘‘నేను ఏ పార్టీనీ తప్పు పట్టడం లేదు’’ అని అంటూనే చాకచక్యంగా నిర్మలా సీతారామన్(Telangana Debts) ఈ కీలక కామెంట్స్ చేయడం గమనార్హం.
- By Pasha Published Date - 08:09 PM, Thu - 13 February 25

Telangana Debts: తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ వేదికగా కీలక వివరాలను వెల్లడించారు. ఒకప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రమని, ఇప్పుడిది అప్పుల కుప్పగా మారిందన్నారు. ఏపీ విభజన నాటికి తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాయని నిర్మల చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎన్నో ప్రాజెక్టుల ద్వారా దాని వికాసానికి చేతనైనంత చేదోడును అందించిందని తెలిపారు. ‘‘నేను ఏ పార్టీనీ తప్పు పట్టడం లేదు’’ అని అంటూనే చాకచక్యంగా నిర్మలా సీతారామన్(Telangana Debts) ఈ కీలక కామెంట్స్ చేయడం గమనార్హం.
Also Read :Valentines Day History : పిల్లలు పుట్టని భార్యలను తోలు ఊడేలా కొట్టే అమానుష పండుగ
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే..
- ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్‌ను మేమే ఏర్పాటు చేశాం.
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది మోడీ సర్కారే.
- తెలంగాణకు సంబంధించి ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం.
- నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది మేమే.
- జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మోడీ సర్కారే.
- వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్కు మేమే ఏర్పాటు చేశాం.
- సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం మేమే ఇచ్చాం.
- బీబీనగర్‌లో ఎయిమ్స్ మేమే ఏర్పాటు చేశాం.
- తెలంగాణలో 2605 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టింది మేమే.
- భారత్ మాల కింద తెలంగాణలో నాలుగు గ్రీన్ కారిడార్లను నిర్మించాం.
- రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5337 కోట్ల బడ్జెట్ ఇచ్చాం.
- తెలంగాణలో ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టాం.
- తెలంగాణలో ఐదు కొత్త వందేభారత్ ట్రైన్లను కేటాయించాం.
- తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ రీడెవలప్ చేశాం.
- రాష్ట్రంలో పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్లను నిర్మించాం.
- స్వచ్ఛ భారత్ మిషన్ కింద తెలంగాణలో 31 లక్షల టాయిలెట్లను నిర్మించాం.
- జల్‌జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో 38 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చాం.
- 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను రాష్ట్రంలో మంజూరు చేశాం.
- 199 జనఔషధి కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటుచేశాం.