Valentines Day History : పిల్లలు పుట్టని భార్యలను తోలు ఊడేలా కొట్టే అమానుష పండుగ
వాలెంటైన్స్ డే (Valentines Day History) వచ్చిందంటే చాలు.. ఇప్పుడు ప్రేమికులు ఆనందంతో పులకించిపోతుంటారు.
- By Pasha Published Date - 06:09 PM, Thu - 13 February 25

Valentines Day History : ఫిబ్రవరి 14న (శుక్రవారం రోజు) ప్రేమికుల దినోత్సవం (వాలెంటైన్స్ డే) జరగబోతోంది. ప్రియుడు, ప్రేయసి మధ్య ప్రేమను సెలబ్రేట్ చేసుకునే సందర్భమే వాలెంటైన్స్ డే. ఈరోజు లవర్స్ ప్రేమపూర్వకంగా మసులుకుంటారు. ఆప్యాయంగా మెదులుతారు. భార్యాభర్తలు సైతం ఈరోజున తమ ప్రేమభావాన్ని గుర్తు చేసుకుంటారు. మరింత అనురాగంతో కలిసిమెలిసి నడుచుకుంటారు. కానీ ఇందుకు పూర్తి భిన్నమైన యాంగిల్ గురించి మనం ఈ కథనంలో తెలుసుకోబోతున్నాం. ఈ అంశంతో ముడిపడిన ఎందుకు ? ఏమిటి ? ఎక్కడ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే దీన్ని చదవాల్సిందే.
Also Read :Mother Of All Bombs: ఇజ్రాయెల్ చేతికి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’.. ఏమిటిది ? ఎందుకోసం ?
స్త్రీలు భయంతో వణికిపోయేలా..
- వాలెంటైన్స్ డే (Valentines Day History) వచ్చిందంటే చాలు.. ఇప్పుడు ప్రేమికులు ఆనందంతో పులకించిపోతుంటారు.
- పురాతన కాలంలో పలువురు రోమన్ మహిళలు ఈ రోజు(ఫిబ్రవరి 14) వస్తుందంటే చాలు వణికిపోయేవారు.
- ఎందుకంటే అప్పట్లో ఫిబ్రవరి 14న సంతానోత్పత్తి పండుగను సెలబ్రేట్ చేసుకునేవారు.
- ఆ రోజున సంతానం లేని మహిళలను రోడ్లపైకి ఈడ్చుకొని వెళ్లి కనికరం లేకుండా కొరడాలతో కొట్టేవారు.
- ఆ విధంగా కొరడాలతో కొడితే సదరు మహిళలకు సంతానం కలుగుతుందని విశ్వసించేవారు.
- పురాతన రోమన్లు ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు సంతానోత్పత్తి పండుగను జరుపుకునేవారు. రోమన్ భాషలో ఆ పండును లూపెర్కాలియా అని పిలిచేవారు.
Also Read :Dalai Lama Z-Category Security: దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత.. కారణమిదే?
- సంతానోత్పత్తి పండుగ రోజున పిల్లలు పుట్టని మహిళలను భర్తలు తోలు ఊడేలా కొట్టాక, మేకలను బలి ఇచ్చేవారు. దీనివల్ల ఆ మహిళలకు సంతాన సామర్థ్యం చేకూరుతుందని విశ్వసించేవారు.
- ఈ పండుగనే తర్వాతి కాలంలో వాలెంటైన్స్ డేగా మారింది.
- ఐదో శతాబ్దం చివరిలో పోపు గెలాక్సీయస్ -1 ఫిబ్రవరి 14ని వాలెంటైన్స్ డేగా ప్రకటించారు. అప్పటి నుంచి సంతానోత్పత్తి పండుగను జరుపుకోవడం ఆపేశారు.