HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Welfare Schemes For Everyone Who Is Eligible Minister

Minister: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: మంత్రి

విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేసి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

  • Author : Gopi Date : 05-08-2025 - 4:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Sridharbabu
Minister Sridharbabu

Minister: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గంలోని ఐదు మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మండలి చీప్ విప్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ మనుచౌదరితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని ఉద్ఘాటించి చెప్పారు. పేదవాడు ఆత్మగౌరవంతో బతికేలా ఉండడానికి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందచేస్తున్నామని అన్నారు.

మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 40 వేల రేషన్ కార్డులు అందచేసామని మరో 60 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నవి పూర్తి కాగానే అందిస్తామని అన్నారు. లక్ష మంది రేషన్ కార్డులో చేర్పులు చేపడుతున్నట్లు తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న భారాస ప్రభుత్వంలో మీ సేవల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన రేషన్ కార్డులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చడంలో సఫలీకృతం అయ్యామని ఇంకా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా భారాస, భాజపా అని లేకుండా అందరికి సంక్షేమ పథకాలు ఫలాలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు.

Also Read: Rakhi : రాఖీ పండుగ హిందువులు ఎందుకు జరుపుకుంటారు?..ఇంకా ఏ మతాలు వారు చేసుకుంటారో తెలుసా…?

విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేసి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు ఉండడం సమాజంలో ఓ గుర్తింపు అని ఆరోగ్య శ్రీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రధాన ఆధారం అని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వజ్రేష్ యాదవ్, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Congress Govt
  • medchal
  • Minister Sridharbabu
  • telangana
  • welfare schemes

Related News

Asaduddin Owaisi

Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షాత్మక చర్యలను ఖండిస్తూ అస‌దుద్దీన్ ఓవైసీకీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని తప్పుపడుతున్న వారు అదే ప్రమాణాన్ని అన్ని మతాల వీధి వేడుకలకూ వర్తింపజేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఒవైసీ.. దేశంలో ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగ

  • Tbjp Chief Ramchandar Rao

    BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd