HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >We Are Committed To Protecting Investments Cm Revanth Reddy

CM Revanth Reddy: పెట్టుబడుల రక్షణకు కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి

తనను తాను సగటు మధ్యతరగతి ఆలోచనలున్న ముఖ్యమంత్రిగా అభివర్ణించుకున్న రేవంత్ రెడ్డి, తన లక్ష్యం ప్రజల శ్రేయస్సు అని తెలిపారు. "కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్నవాడిని కాదు" అని స్పష్టం చేశారు.

  • Author : Gopi Date : 15-08-2025 - 5:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: హైదరాబాద్‌లో జరిగిన CREDAI ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, పారదర్శక పాలసీలతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. పెట్టుబడిదారుల భద్రత, లాభదాయకత, పాలసీల స్థిరత్వంపై ముఖ్యమంత్రి స్పష్టమైన సందేశం ఇచ్చారు.

పారదర్శక పాలసీలతో అభివృద్ధి దిశగా

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలసీ, కన్‌స్ట్రక్షన్ రంగాలను రాష్ట్ర అభివృద్ధికి రెండు గ్రోత్ ఇంజిన్లుగా భావిస్తోందని తెలిపారు. “పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం” అని ఆయన అన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా, అవి లాభాలు తెచ్చేలా ప్రోత్సహించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Sudarshan Chakra : స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయబోతున్న భారత్

కొన్ని వర్గాలు సృష్టిస్తున్న అపోహలు, అనుమానాలను తొలగించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. “రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మీరు ఊతం ఇస్తే నష్టపోయేది మీరే. ఇతర దేశాల పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్న మేము, మన రాష్ట్రంలో ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం?” అని రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తనను తాను సగటు మధ్యతరగతి ఆలోచనలున్న ముఖ్యమంత్రిగా అభివర్ణించుకున్న రేవంత్ రెడ్డి, తన లక్ష్యం ప్రజల శ్రేయస్సు అని తెలిపారు. “కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్నవాడిని కాదు” అని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటానని, కానీ అనుచిత డిమాండ్లకు మాత్రం సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఈ ప్రసంగం ద్వారా ముఖ్యమంత్రి పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ప్రజలకు మేలు చేకూరే విధంగా, నిబంధనల ప్రకారం మాత్రమే అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టమైన సందేశాన్ని అందించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Credai
  • HYD News
  • hyderabad
  • Investments
  • telangana

Related News

Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

తెలంగాణలోని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు (జూన్ 30) లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కోత విధించనున్నారు. గత ఏడాది కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది వినియోగదారు

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

Latest News

  • Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?

  • Donald Trump: ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

  • Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd