Raj Pakala House: రాజ్ పాకాల ఇంట్లో జరిగింది కేవలం విందు మాత్రమేనా..?
అయితే విజయ్ మద్దూరికి రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అసలు రాజ్ పాకాలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అనేది పెద్ద ప్రశ్న. విజయ్ తో పాటు పార్టీలో పాల్గొన్న వాళ్లు ఎలాంటి సమాచారం ఇచ్చారు.
- By Gopichand Published Date - 09:13 AM, Mon - 28 October 24

Raj Pakala House: తెలంగాణలో జన్వాడ పార్టీ వివాదం ఎంత హాట్ టాపిక్‌గా మారిందో తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో (Raj Pakala House) జరిగింది కేవలం విందు మాత్రమేనా..? కేటీఆర్ చెబుతున్న దాంట్లో నిజమెంత..? కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడానికి అంత సమయం ఎందుకు తీసుకున్నారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అయితే విజయ్ మద్దూరికి రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అసలు రాజ్ పాకాలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అనేది పెద్ద ప్రశ్న. విజయ్ తో పాటు పార్టీలో పాల్గొన్న వాళ్లు ఎలాంటి సమాచారం ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే శైలేంద్ర, నాగేశ్వర్ రెడ్డి ఇంట్లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల సోదాల్లో విదేశి లిక్కర్ బాటిల్స్ పెద్ద మొత్తంలో దొరికాయి. అవి ఎవరు తీసుకొచ్చారు? ఇంత జరుగుతుంటే రాజ్ పాకాల అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయాడు. విజయ్ మాత్రమే డ్రగ్స్ తీసుకుంటే రాజ్ ఎందుకు పారిపోయాడని సందేహలు మొదలయ్యాయి.
Also Read: Curfew In Hyderabad: హైదరాబాద్‌లో నెల రోజులు కర్ఫ్యూ.. ఏం జరుగుతోంది?
ఒకవేళ రాజ్ పాకాల డ్రగ్స్ తీసుకోకుంటే పారిపోవాల్సిన అవసరం ఏముంది? కేటీఆర్ చెబుతున్న దానికి.. జరుగుతన్న రియాలిటీకి ఎక్కడా పొంతన లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. శైలేంద్ర, నాగేశ్వర్ రెడ్డి ఇంట్లో మద్యం బాటిళ్లు మాత్రమే దొరికాయా? పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతుందనేది మరో 24 గంటల్లో తెలిసే అవకాశం ఉంది.
ఫామ్ హౌస్‌లపై సీఎం రేవంత్ ఫోకస్
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఇక ఫాం హౌస్‌ల పై ఫోకస్ పెట్టింది. రేవ్ పార్టీలు, సెలబ్రేషన్ల ముసుగులో అమ్మాయిలతో జల్సాలు, మద్యం సేవించడం నియంత్రించే విషయంలో సీరియస్ గా ఉంది. నగర శివారు ప్రాంతాలలో ఫాం హౌస్‌ల పేరుతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు పిర్యాదు చేస్తున్నారు. జన్వాడా ఫాం హౌస్ ఘటన కూడా స్థానికుల ఫిర్యాదుతోనే వెలుగులోకి వచ్చింది.