Vijayashanti: ఠాక్రేపై విరుచుకుపడ్డ విజయశాంతి
బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆమెతో కాంగ్రెస్ చర్చలు జరపనున్నట్టు వస్తున్న వార్తల్ని ఆమె తీవ్రంగా ఖండించింది.
- By Praveen Aluthuru Published Date - 06:57 PM, Sat - 24 June 23

Vijayashanti: బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆమెతో కాంగ్రెస్ చర్చలు జరపనున్నట్టు వస్తున్న వార్తల్ని ఆమె తీవ్రంగా ఖండించింది. ఆమెతో కాంగ్రెస్ చర్చలు జరిపినట్టు త్వరలోనే పార్టీ మారబోతున్నట్టు మాణిక్ రావు ఠాక్రే లీకేజీలిస్తూ, అవాస్తవాలు మాట్లాడుతున్నాడని ఆమె మండిపడింది. ఈ విషయంలో క్షమాపణలు చెప్పడం కనీస బాధ్యత అని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు మతి భ్రమించినట్లుంది, అందుకే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నటున్నారని ఫైర్ అయ్యారు విజయశాంతి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం బీజేపీ ఇంటింటికి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా నేతలు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరిస్తున్నారు. ఇక ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా విజయశాంతి హైదరాబాద్ లోని కూకట్ పల్లి, మూసాపేట్ EWS భరత్ నగర్ లో ఆమె పర్యటించారు. ఆమెకు కార్యకర్తలు పెద్దఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నారు.
Read More: Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం