HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Victory Celebrations Of Public Governance Cm Revanth Reddys Key Call

CM Revanth Reddy: ప్రజాపాలన విజయోత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క పిలుపు

శనివారం సాయంత్రం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

  • Author : Gopi Date : 23-11-2024 - 9:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Key Meeting
CM Revanth Key Meeting

CM Revanth Reddy: డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సూచించారు.

శనివారం సాయంత్రం సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన-విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్లో ఈనెల 19న మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని ముఖ్యమంత్రి అధికారులను అభినందించారు.

ఈనెల 30వ తేదీన మహబూబ్నగర్ లో ఏర్పాటు చేసే రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెండు రోజుల ముందు నుంచే.. 28వ తేదీ నుంచే రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి అవసరమైన ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు పంటల బీమా, సన్న వడ్లకు బోనస్.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తొలి ఏడాదిలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు.

Also Read: Rahul-Yashasvi: పెర్త్‌లో రికార్డు సృష్టించిన భారత బ్యాట్స్‌మెన్.. 1948 త‌ర్వాత ఇప్పుడే!

డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లి జిల్లాల్లో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదే వేదికగా గ్రూప్ 4 తో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు. తమ శాఖల వారీగా రోజుకో మంత్రి తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్తు ప్రణాళికను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలని అన్నారు. ఈ మూడు రోజుల పాటు హైదరాబాద్లో సెక్రెటేరియట్ పరిసరాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతమంతా ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉండేలా వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. మూడు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టి పడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షో, కన్నుల పండువలా ఉండే డ్రోన్ షోలను నిర్వహించాలని సూచించారు. అన్ని వర్గాలను ఇందులో భాగస్వాములను చేయాలని చెప్పారు.

రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన సెక్రెటేరియట్ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు.

నియోజకవర్గానికో వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి… లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పోలీస్ అధికారులను ఆదేశించారు. సెక్రెటేరియట్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ పై ఉత్సవాలు జరిగేందుకు వీలుగా వాహనాలను దారి మళ్లించాలని సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth News
  • CM Revanth Reddy
  • congress
  • telangana
  • telugu news
  • TG News
  • ts politics
  • Victory celebrations

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Cm Revanth Mptc Zptc

    Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

  • Telangana Government Good N

    Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

Latest News

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

Trending News

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd