Venu Swamy: నాగ చైతన్యపై అనుచిత వ్యాఖ్యలు.. బహిరంగంగా క్షమాపణలు చెప్పిన వేణు స్వామి
నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి పేర్కొన్నారు. ఉమెన్ కమిషన్‌కు క్షమాపణలు చెప్పారు.
- By Gopichand Published Date - 06:13 PM, Tue - 21 January 25

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) నిత్యం వార్తల్లో ఉంటారు. రాజకీయ, సినీ ప్రముఖుల జాతకాలు చెప్పి తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నాడు వేణు స్వామి. టాలీవుడ్ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను సైతం జాతకాలను చెప్పి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. గతంలో నాగ చైతన్య- సమంత విడిపోతారని జాతకం చెప్పటంతో వేణు స్వామి లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత చాలా మంది హీరోయిన్లకు ప్రత్యేక పూజలు సైతం చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కేసీఆర్, వైఎస్ జగన్ విజయం సాధించి సీఎంలు అవుతారని జాతకం చెప్పాడు. తన జాతకం తప్పు అయితే జీవితంలో జాతకాల జోలికి పోనని కూడా ప్రామిస్ చేశాడు. వేణు స్వామి చెప్పినట్లు కాకుండా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో వేణు స్వామిపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి.
Also Read: Saif Ali Khan: ఆస్ప్రతి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్
అయితే తాజాగా తెలంగాణ ఉమెన్ కమిషన్‌కి వేణు స్వామి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. హీరో నాగ చైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో నాగ చైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని వేణు స్వామి జోస్యం చెప్పటం వివాదాస్పదమైంది. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్‌కి ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై వేణు స్వామికి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణి స్వామికి మరొకసారి ఉమెన్ కమిషన్ నోటీసులు పంపింది.
నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి పేర్కొన్నారు. ఉమెన్ కమిషన్‌కు క్షమాపణలు చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని వేణు స్వామిని ఉమెన్ కమిషన్ హెచ్చరించింది.