Aashritha Election Campaign: వెంకటేష్ కూతురు తొలి రాజకీయ ప్రసంగం
రఘురామ్ రెడ్డి తెలంగాణ లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ తరుపున ఖమ్మం లోకసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా తన మామ కోసం కోడలు ఆశ్రిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇది ఆమెకు తొలి రాజకీయ ప్రసంగం కావడం విశేషం.
- By Praveen Aluthuru Published Date - 04:52 PM, Wed - 1 May 24

Aashritha Election Campaign: హీరో వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు అర్జున్ గోపాల గోపాల సినిమాలో తండ్రి కి కొడుకుగా నటించి మెప్పించాడు. వెంకీ ముద్దుల కూతురు ఆశ్రిత హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జరిగింది. వినాయక్ రెడ్డి తండ్రి పేరు రఘురామ్ రెడ్డి. రఘురామ్ రెడ్డి తెలంగాణ లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ తరుపున ఖమ్మం లోకసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా తన మామ కోసం కోడలు ఆశ్రిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇది ఆమెకు తొలి రాజకీయ ప్రసంగం కావడం విశేషం.
We’re now on WhatsApp. Click to Join
రఘురాంరెడ్డి కోసం వెంకటేష్ ప్రచారం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే తండ్రి వెంకీకి బదులుగా ఆశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె ఖామ్మంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ప్రసంగించారు. మే 13న మనమందరం కాంగ్రెస్‌కు ఓటు వేసి, రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో ఎన్నుకుందామని ఖమ్మం ఓటర్లను ఆమె కోరారు ఆశ్రిత. ఈ సందర్భంగా ఆమెను కాంగ్రెస్ నేతలు శాలువాతో సత్కరించారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read; Swiggy: స్విగ్గీకి షాక్ ఇచ్చిన ఐస్ క్రీమ్.. అసలేం జరిగిందంటే..?