Uttam Kumar Reddy : వచ్చే ఎన్నికల్లో హుజుర్‌నగర్ నుంచి మళ్ళీ పోటీ చేస్తా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్..
తాజాగా కాంగ్రెస్(Congress) ఎంపీ ఉత్తమ్ కుమార్(Uttam Kumar Reddy) మీడియాతో మాట్లాడుతూ BRS పై, ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై ఫైర్ అయ్యారు. అలాగే వచ్చే ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడారు.
- By News Desk Published Date - 10:00 PM, Mon - 5 June 23

తెలంగాణ(Telangana) ఎలక్షన్స్(Elections) దగ్గరపడుతున్న సమయంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది పార్టీలు మారడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది తమ సీట్లను కాపాడుకోవడానికి చూస్తున్నారు. ఇక కొంతమంది ఇప్పట్నుంచే తాము ఎక్కడి నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయి పార్టీ అధిష్టానాలతో ఫిక్స్ చేయించుకుంటున్నారు.
తాజాగా కాంగ్రెస్(Congress) ఎంపీ ఉత్తమ్ కుమార్(Uttam Kumar Reddy) మీడియాతో మాట్లాడుతూ BRS పై, ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై ఫైర్ అయ్యారు. అలాగే వచ్చే ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లు పూర్తయిన తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం విడ్డూరంగా ఉంది. ఎన్నికల కోసమే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. మందుబాబుల వద్ద కమిషన్ తీసుకుంటున్న ఎమ్మెల్యేలు వైన్ షాపుల ముందు ఉత్సవాలు జరుపుకోవాలి. తెలంగాణలో ఒక్కోక్కరి తలపై రూ.లక్ష అప్పు చేసినందుకు దశాబ్ది ఉత్సవాలు చేసుకోవాలి. రైతు రుణమాఫీ చేయనందుకు ఉత్సవాలు జరుపుకోవాలి. పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేసినందుకు ఉత్సవాలు జరుపుకోవాలి. ల్యాండు, సాండ్, మైన్స్, వైన్స్ కమిషన్ల పేరిట ఎమ్మెల్యేలు దోచుకున్నందుకు ఉత్సవాలు జరుపుకోవాలి అని ఫైర్ అయ్యారు.
ఇక రాబోయే ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాలు కమర్షియల్ అయింది వాస్తవం. కమర్షియల్ రాజకీయాలు నేను చేయలేను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ హుజుర్‌నగర్ నుండి పోటీ చేస్తాను అని తెలిపారు. గతంలో మూడుసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్‌నగర్ నుంచి MLA గా గెలిచాడు. కానీ 2019 లో ఎంపీగా పోటీ చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడు. బైపోల్ రావడంతో తన భార్యని నిల్చోబెట్టినా ఆమె ఓడిపోయి BRS అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిచాడు. ఈసారి ఎలాగైనా హుజుర్‌నగర్ ని మళ్ళీ తన చేతిలోకి తెచ్చుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసారి MLA గా హుజుర్‌నగర్(Huzur Nagar) నుంచే పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. మరి ఈ సారి హుజుర్‌నగర్ MLA సీటు BRS కి వస్తుందా లేక కాంగ్రెస్ సాధిస్తుందా చూడాలి. ఆ నియోజకవర్గంలో BJP అయితే అంత బలంగా లేదు.
Also Read : TS Congress: రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్.. నిజంగా అంత సీనుందా?