Kishan Reddy Nephew: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంలో విషాదం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కుటుంబంలో విషాదం నెలకొంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గురువారం రోజు గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.
- Author : Gopichand
Date : 24-02-2023 - 7:49 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కుటుంబంలో విషాదం నెలకొంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గురువారం రోజు గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం నోయిడాలో ఉన్న కిషన్ రెడ్డికి ఈ వార్త తెలియడంతో వెంటనే హైదరబాద్ కు పయనమయ్యారు. జీవన్ రెడ్డి.. కిషన్ రెడ్డి అక్క లక్ష్మి, బావ నర్సింహారెడ్డిల కుమారుడు.
Also Read: Israel: ఇజ్రాయిల్‌పై పాలస్తీనా దాడి.. గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడులు
కిషన్ రెడ్డి అల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. కిషన్ రెడ్డి సోదరి హైదరాబాద్ లోని సైదాబాద్‌లో నివాసముంటారు. ఆమె కుమారుడే జీవన్‌రెడ్డి. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవన్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన మృతితో సైదాబాద్‌లో విషాదవాతావరణం ఏర్పడింది. జీవన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ వార్త తెలియగానే పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు.