HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tspsc Leakage A Satirical Poster Saying That Tspsc Is A Xerox Center

TSPSC Leakage: పోస్టర్లు కలకలం.. టీఎస్పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు..!

టీఎస్పీఎస్సీ (TSPSC) కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరిట ఈ పోస్టర్లు ప్రచురితమయ్యాయి.

  • Author : Gopichand Date : 22-03-2023 - 1:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TSPSC Leakage
Resizeimagesize (1280 X 720) (2) 11zon

టీఎస్పీఎస్సీ (TSPSC) కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరిట ఈ పోస్టర్లు ప్రచురితమయ్యాయి. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రశ్నపత్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని పోస్టర్లు అంటించారు.

ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పరీక్ష రాసిన అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా టీఎస్పీఎస్సీ వ్యవహారం అభ్యర్థులను విస్మయానికి గురిచేస్తోంది. టీఎస్‌పీఎస్సీని రద్దు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులను ఐదో తేదీన సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. నేడు హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయంలో విచారణ జరగనుంది. గ్రూప్ 1 రాసిన వారిలో కొందరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ఉన్నట్లు సిట్ గుర్తించింది. కమిషన్ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 8 మంది గ్రూప్ 1 రాసినట్లు తేలింది. ఈ 8 మందికి నోటీసులు ఇచ్చిన తర్వాత సిట్ విచారణ జరుపుతుంది. ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో పెన్ డ్రైవ్‌లను సిట్ స్వాధీనం చేసుకుంది. కానీ పెన్ డ్రైవ్ లకు కూడా పాస్ వర్డ్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని సిట్ అధికారులు విచారించారు.

Also Read: Saudi Airport: సౌదీ ఎయిర్‌పోర్టులో తెలంగాణ వ్యక్తి మృతి.. మరణించిన మూడు వారాల తర్వాత వెలుగులోకి..!

పోస్టర్‌లో ఏముంది..?

– తప్పు చేసిన TSPSC బోర్డుని రద్దు చేయకుండా పరీక్షను ఎందుకు రద్దు చేశారు? తప్పు చేసిందేమో టీఎస్పీఎస్సీ బోర్డు.. శిక్ష మాత్రం విద్యార్థులకా? ఇదీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ పనితీరు.

– ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి

– ప్రశ్నపత్రం లీకేజీలో మీ కుటుంబ సభ్యుల పాత్ర లేదని వెంటనే సీబీఐకి అప్పగించి టీఎస్‌పీఎస్సీ బోర్డును, సంబంధిత మంత్రిని తొలగించాలి.

– నష్టపోయిన విద్యార్థులకు నెలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఈ నెల నుంచి మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు నష్టపరిహారం చెల్లించాలి’ అని పోస్టర్లు వెలిశాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • hyderabad
  • Paper Leak
  • Satirical Posters
  • telangana
  • TSPSC
  • TSPSC Leakage

Related News

Rowdy Sheeter Rapes A Minor

మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. రక్షణ కల్పించాల్సిన సమాజంలో కొందరు రౌడీ షీటర్లు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు

  • Indiramma Housing Scheme 2n

    హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • bjp Mp Godam Nagesh

    తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd