Whats Today : తెలంగాణలో అమిత్‌షా, రాజ్‌నాథ్, హిమంత, ప్రియాంక, డీకేఎస్ ప్రచారభేరి
Whats Today : ఇవాళ, రేపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పర్యటిస్తారు.
- Author : Pasha
Date : 24-11-2023 - 7:55 IST
Published By : Hashtagu Telugu Desk
Whats Today : ఇవాళ, రేపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తి, 1.30 గంటలకు హుస్నాబాద్, సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలలో ఆమె పాల్గొంటారు. రాత్రి ఖమ్మంలో బస చేసి.. రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరు, మధ్యాహ్నం 1:30 గంటలకు సత్తుపల్లి, మధ్యాహ్నం 2.40 గంటల నుంచి 3.30 గంటల వరకు మధిర ప్రచార సభలలో పాల్గొంటారు.
- ఇవాళ నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు నకిరేకల్, మధ్యాహ్నం 1 గంటలకు తుంగతుర్తి, మధ్యాహ్నం 2 గంటలకు ఆలేరు, మధ్యాహ్నం 3.30 గంటలకు కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్‌ల లో ఆయన ప్రసంగిస్తారు.
- ఇవాళ, రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొంటారు. ఇవాళ స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గం కార్నర్ మీటింగ్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. ఈరోజు రాత్రి అంబర్ పేట నియోజక వర్గం కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. శనివారం హైదరాబాద్ లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లలో పాల్గొంటారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటిస్తారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ఆర్మూర్ లో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3.10 గంటల నుంచి 3.40 గంటల వరకు రాజేంద్రనగర్ నియోజక వర్గంలో, 4.30 గంటల నుంచి 5.10 గంటల వరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో, 5.30 గంటల నుంచి 6.10 గంటల వరకు అంబర్ పేట నియోజకవర్గంలో రోడ్ షోలలో అమిత్ షా పాల్గొంటారు.
- ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈరోజు ఉదయం 11 గంటలకు మేడ్చల్, సాయంత్రం 4 గంటలకు కార్వాన్, సాయంత్రం 5 గంటలకు కంటోన్మెంట్ బహిరంగ సభలలో ప్రసంగిస్తారు.
- ఇవాళ కొమరంభీం జిల్లాలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి శాంతన్ సర్కార్ పర్యటిస్తారు. కాగజ్‌నగర్ మండలం నజురుల్ నగర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తారు.
- ఇవాళ మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
- ఇవాళ ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి మాసానికి సంబంధించిన టికెట్లను రిలీజ్ చేయనుంది.
- ఇవాళ సీఎం స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరవుతారు.
- ఇవాళ వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర 20వ రోజు. ఈరోజు బస్సు యాత్ర పాలకొండ (పార్వతీపురం మన్యం జిల్లా), శ్రీశైలం (నంద్యాల జిల్లా), జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా)లలో జరుగుతుంది.
- ఇవాళ మధ్యాహ్నం విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బోట్ల యజమానులు, వాటిపై ఆధారపడ్డ మత్స్యకార్మికులతో సమావేశం అవుతారు. పార్టీ తరఫున ఒక్కో బోటుకు రూ.50 వేల ఆర్ధిక సాయం(Whats Today)అందిస్తారు.