Teenmar Mallanna : బిఆర్ఎస్ లోకి తీన్మార్ మల్లన్న..ఏమన్నా మార్ఫింగా..?
కేటీఆర్‌ను ఓ ఆట ఆడుకునే మల్లన్న కేటీఆర్ చేతులమీదుగానే బీఆర్ఎస్‌లో చేరినట్టు ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు
- By Sudheer Published Date - 02:06 PM, Thu - 23 November 23

టెక్నాలజీ (Technology) పెరిగిపోతుందని సంబరపడాలో..టెక్నాలజీ పుణ్యమా అని ఘోరాలు జరుగుతున్నాయని బాధపడాలో అర్ధం కావడంలేదు. మొన్నటికి మొన్న ప్రముఖ నటి రష్మిక (Rashmika) ఫేక్ మార్ఫింగ్ (Deepfake video ) వీడియో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఫై సినీ స్టార్స్ మాత్రమే కాదు పొలిటికల్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే కాదు టెక్నాలజీ తో చాలామంది ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. తాజాగా తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ..బిఆర్ఎస్ (BRS) లో చేరినట్లు..కేటీఆర్ (KTR) తో ఆయన కలిసినట్లు ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల వేడి ఎలాగుందో చెప్పాల్సిన పనిలేదు. అధికార పార్టీ బిఆర్ఎస్ ప్రతి ఫ్లాట్ ఫామ్ ను వాడుకుంటూ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఇదే తరుణంలో ఎవరో కేటీఆర్‌ను ఓ ఆట ఆడుకునే మల్లన్న కేటీఆర్ చేతులమీదుగానే బీఆర్ఎస్‌లో చేరినట్టు ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. కొన్ని నిమిషాల్లోనే ఫొటో వైరల్‌గా మారిపోయింది. చూసేందుకు నిజంగానే మల్లన్నకు కేటీఆర్ కండువా కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించినట్టు ఉన్నాయి ఈ ఫొటోలు. ఇదే విషయంలో మల్లన్న క్లారిటీ ఇచ్చాడు. ఈ ఫేక్ ఫొటో కాళేశ్వరం రీ డిజైన్ లాగే దరిద్రంగా ఉందంటూ.. ఫేక్ ఫొటోను, ఒరిజినల్ ఫొటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దంటూ తన ఫాలోవర్స్‌కు చెప్పాడు. మల్లన్న ఈ క్లారిటీ ఇచ్చేవరకూ చాలా మంది నిజంగానే ఆయన బీఆర్‌ఎస్‌లో చేరాడని చాలా మంది అనుకున్నారు.
ప్రస్తుతం మల్లన్న కాంగ్రెస్ పార్టీ లో చేరి..కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నాడు. కేసీఆర్ ను ఈసారి గద్దె దించుడే అని గట్టిగా పట్టుపడుతున్నారు. నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ పాలన లో జరిగిన పలు స్కామ్ లను , పేపర్ లీకేజ్ లు వంటివి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
కాళేశ్వరం డిజైన్ అంత గొప్పగా ఉందిరా డ్రామారావు నీ మార్ఫింగ్ pic.twitter.com/BELp5Oo9pt
— Teenmar Mallanna (@TeenmarMallanna) November 22, 2023
Read Also : TS Polls : ఇక ఆశలు వదులుకోవాల్సిందే అని కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ చెప్పాడా..?