HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >The Telangana Government Has Given Good News Farmer Insurance Rs 12 Thousand

Telangana Government: గుడ్ న్యూస్ చెప్పిన‌ తెలంగాణ ప్ర‌భుత్వం.. రైతు భరోసా రూ.12 వేలు!

ఇంకా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయ‌న్నారు.

  • Author : Gopi Date : 04-01-2025 - 9:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Government
Telangana Government

Telangana Government: రైతుల‌కు, కొత్త రేష‌న్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సామాన్యుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ వినిపించ‌నుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన‌ట్లు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాల కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. సింగూరు ప్రాజెక్టుకి మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణ‌యం తీసుకున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.

కేబినెట్ మీటింగ్ అనంత‌రం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొత్త సంవత్సరంలో మంచి జరగాలని, వ్యవసాయాన్ని పండగ చేయాలని రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎలాంటి షరతులు లేకుండా ప్రతీ ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతమున్న రూ.10వేల రైతు భరోసాను రూ.12వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకానికి “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా” నామకరణం చేస్తున్నామ‌న్నారు.

Also Read: Pawan Kalyan: చిరంజీవి వార‌సుడు ఇలా కాకుంటే ఎలా ఉంటాడు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఇంకా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయ‌న్నారు. రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు (మైనింగ్, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, నివాస, పారిశ్రామిక, వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే భూములు, నాలా కన్వర్టెడ్ భూములు, వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూములకు) రైతు భరోసా వర్తించదని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే మా ప్రభుత్వం విధానమ‌ని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agriculture News
  • cm revanth
  • congress
  • ration cards
  • rythu bharosa
  • telangana
  • Telangana schemes

Related News

IMD Alert

Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసర

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

  • Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

  • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd