HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ministers Key Comments On Rythu Bharosa Only They Are Eligible

Rythu Bharosa: రైతు భ‌రోసాపై మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు.. వారు మాత్ర‌మే అర్హులు!

ఇక‌పోతే రాష్ట్రంలోని రైతులు ఆశ‌గా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై మంత్రి తుమ్మ‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్న‌ట్లు మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు.

  • Author : Gopi Date : 28-12-2024 - 11:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rythu Bharosa
Rythu Bharosa

Rythu Bharosa: తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌లకు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసే దిశ‌గా క‌స‌రత్తులు చేస్తోంది. అయితే చెప్పిన విధంగానే రైతుల‌కు రుణ‌మాఫీ చేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. రైతుల‌కు ఇచ్చిన మ‌రో హామీని అమ‌లు చేయ‌నుంది. ఇప్ప‌టికే రైతు భ‌రోసాకు (Rythu Bharosa) సంబంధించిన విధివిధానాల‌ను ప్ర‌భుత్వం రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే సంక్రాంతి నుంచి రైతు భ‌రోసాను అర్హులైన రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్న‌ట్లు అధికారులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఇక‌పోతే రాష్ట్రంలోని రైతులు ఆశ‌గా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై మంత్రి తుమ్మ‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్న‌ట్లు మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు. అంతేకాకుండా రైతుల‌కు పిడుగు లాంటి వార్త చెప్పారు. వ్యవసాయ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం స‌చివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం అందించటం తమ ఉద్దేశమని మంత్రి తుమ్మల మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. దీంతో చాలామంది రైతులు అయోమ‌యంలో ప‌డ్డారు. ఇప్పుడు చాలా మంది రైతులు త‌మ పొలాల‌ను కౌలుకు ఇచ్చి భూమి ఉన్న‌వారు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి వారికి రైతు భ‌రోసా వ‌స్తుందా? రాదా అనే గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు.

Also Read: New Year : కొత్త ఏడాది సందర్బంగా కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్

రైతు భ‌రోసా రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు?

గత బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రైతులకు రైతు భ‌రోసా కింద రూ. 10 వేలు అందించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ ప‌ది వేల‌కు మ‌రో ఐదు వేలు వేసి రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. అంటే రైతులకు రూ. 15 వేలు పెట్టుబ‌డి సాయంగా అందించ‌నున్నారు. గ‌త ప్ర‌భుత్వంలో రైతు భ‌రోసా డ‌బ్బులు దుర్వినియోగం అయ్యాయ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Minister Tummala Nageswara Rao
  • rythu bharosa
  • Telangana Assembly
  • Telangana Assembly 2024
  • telangana farmers
  • telugu news

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd