Telengana CM Revanth Reddy: అల్లు అర్జున్ నాకు తెలుసు.. నేను అల్లు అర్జున్‌కు తెలుసు: సీఎం రేవంత్
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?
- By Gopichand Published Date - 11:30 PM, Fri - 13 December 24

Telengana CM Revanth Reddy: ఢిల్లీలో ఓ హిందీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి (Telengana CM Revanth Reddy) కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోం శాఖ నా వద్ద ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్ట్ నాకు తెలుసు. అల్లు అర్జున్ అరెస్టు చేశామంటున్నారు.. అక్కడ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్నాడు. జనం ప్రాణం పోయింది అయినా కేసు పెట్టొద్దా..? కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది.. కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులుపి హడావిడి చేశారు. దాంతో జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు కంట్రోల్ కాలేదు. నాకు చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ తెలుసు. అతనికి నేను తెలుసు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నేత, అల్లు అర్జున్ కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత, నాకు బంధువు. అల్లు అర్జున్ భార్య మాకు బంధువు. అయినా రాజ్యాంగం, చట్టం ప్రకారమే జరుగుతాయి.
Also Read: Kids Become Chess Champion : మీ బిడ్డ కూడా చెస్ మాస్టర్ కావచ్చు..! అతని ఈ అలవాట్లను గుర్తించండి..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా? అతనేమైనా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పోరాడి.. ఇండియాను గెలిపించాడా? సినిమాలో నటించాడు. డబ్బులు సంపాదించాడు’’ అని అన్నారు.
ఆజ్ తక్ న్యూస్ ఛానల్ ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఫేవరెట్ యాక్టర్ ఎవరనే దానిపై ఇంట్రస్టింగ్ అంశాలు వెల్లడించారు. నా ఫేవరెట్ నటుడు కృష్ణ . ఆయన ఇప్పుడు లేరు. నాకు నేనే పెద్ద స్టార్‌ని. నాకంటూ అభిమానులు ఉండాలి కానీ, నేనెవరికీ అభిమానిని కాదు అని అన్నారు.
ఇకపోతే అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన చంచల్‌గూడ జైలు నుంచి బన్నీ రిలీజ్ కాకపోవడం గమనార్హం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన పని తాను చేసిందని సీఎం రేవంత్ అంటున్నారు.