Telangana Polls : తెలంగాణలో ఊపందుకున్న టెలీ ప్రచారం..
ఓటర్లను ఆకర్షించేందుకు ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) వాయిస్ కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లు చేస్తూ వస్తున్నారు
- Author : Sudheer
Date : 16-11-2023 - 12:27 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Polls) సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయ పార్టీలు (Political Parties) దేనిని వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తున్నారు. ఓ పక్కటి లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుండగా..అభ్యర్థులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీల అధినేతలు జిలాల్లో భారీ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియా , న్యూస్ చానెల్స్ లలో పాల్గొంటూ తమ పార్టీకే ఓటు వేయాలని కొడుతున్నారు. ఇవే కాదు తాజాగా టెలీ ప్రచారాన్ని (Tele Campaign) కూడా చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఓటర్లను ఆకర్షించేందుకు ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) వాయిస్ కాల్‌లు, ఎస్‌ఎంఎస్‌లు చేస్తూ వస్తున్నారు. వారి నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా ఆధారంగా వ్యక్తిగత ఫోన్ నంబర్లు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి , వీటి ద్వారా ఓటర్లకు నేరుగా ఫోన్ చేసి .. హలో, నేను మీ అభ్యర్థిని. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుని నన్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నాను.
ఎన్నికల ప్రచారం కోసం “ఈయన మీ అభ్యర్థి” SMS కూడా ఉపయోగించబడుతోంది. పోన్ కాల్ కాకుండా ఎస్ఎంఎస్ లు కూడా చేస్తున్నారు. ఇలా అంత కూడా ఏ ఫ్లాట్ ఫామ్ ను వదిలిపెట్టకుండా ఓటర్లను ఆకట్టుకునే పనిచేస్తున్నారు. మరి ఓటర్లు ఎవరికీ పట్టం కడతారో చూడాలి.
Read Also : Maruti Ciaz Sedan Car: రూ.1.07 లక్షలు డౌన్ పేమెంట్ తో ఈ కారు కొనుగోలు చేయవచ్చు.. అసలు ధర ఎంతంటే..?