HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Marks A Historic Milestone

రైతు సంక్షేమంలో నూతన అధ్యాయం.. తెలంగాణలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ!

మంత్రి ఇంకా మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికి వచ్చే పండుగ, సిరిసంపదలు వెల్లివిరిసే సమయం. మన అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం.

  • Author : Gopi Date : 13-01-2026 - 3:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

Telangana: పంట చేతికొచ్చే పండుగ వేళ మన తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఒక అపూర్వమైన, చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ఇది కేవలం గణాంకం మాత్రమే కాదు మన ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల చూపిస్తున్న అంకితభావానికి నిదర్శనం.

రికార్డు స్థాయి ధాన్యం సేకరణ

ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం 70.82 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును మనం ఇప్పుడు అధిగమించాము. దేశంలోనే మరే రాష్ట్రం సాధించని విధంగా, అత్యధిక ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Also Read: జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు సాధ్యం కాదా?

రైతులకు లబ్ధి- ఆర్థిక భరోసా

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ భారీ సేకరణ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరింది. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందించాలనే సంకల్పంతో కనీస మద్దతు ధర కింద రూ. 16,606 కోట్లు చెల్లించాము. రైతులకు మరింత అండగా ఉండేందుకు మరో రూ. 1,425 కోట్లను బోనస్ రూపంలో అందించామని వివ‌రించారు.

సమృద్ధి- కృతజ్ఞత

మంత్రి ఇంకా మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికి వచ్చే పండుగ, సిరిసంపదలు వెల్లివిరిసే సమయం. మన అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం. ధాన్యం సేకరణలో మనం సాధించిన ఈ అద్భుత విజయం తెలంగాణ రైతాంగం కష్టానికి, ప్రభుత్వ పారదర్శక విధానాలకు దక్కిన గౌరవం అని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా, తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టే దిశగా మనం వేస్తున్న ఈ అడుగులు మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నానని మంత్రి ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి ప్రతి రైతు ఇంట్లో సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని నింపాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని, రైతు సంక్షేమమే మన బాట – తెలంగాణ ప్రగతి మన లక్ష్యం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Minister Uttam Kumar Reddy
  • Record Rice
  • sankranthi 2026
  • telangana

Related News

Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, జనసేన మధ్య నెలకొన్న వివాదం చల్లారడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్, జనసేన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నె

  • Cm Revanth Reddy: వర్షం వస్తే నేనే రోడ్డు మీదికి వస్తా.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

Latest News

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

  • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd