HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Hc To Hear Plea On Cctvs In Police Stations To Prevent Torture

CCTV Cameras: పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై రేపు హైకోర్టులో విచారణ

పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గత కొంతకాలంగా వాదనలు జరుగుతున్నాయి. పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని, మానవ హక్కులను ఉల్లంగిస్తూ

  • Author : Vamsi Chowdary Korata Date : 09-07-2023 - 4:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CCTV Cameras
New Web Story Copy 2023 07 09t163109.794

CCTV Cameras: పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై గత కొంతకాలంగా వాదనలు జరుగుతున్నాయి. పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని, మానవ హక్కులను ఉల్లంగిస్తూ అమాయక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే అన్ని పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా పోలీసులు క్రూరత్వానికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు న్యాయవాది రాపోలు భాస్కర్. తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనీ భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసు స్టేషన్‌లలో సీసీటీవీ నిఘా ఉంటే కస్టడీలో చిత్రహింసలు, మరణాల ఘటనలు తగ్గుముఖం పడతాయని పిల్‌లో పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం (జూలై 10) విచారణ చేపట్టనుంది.

తెలంగాణలో అనేక కస్టడీ మరణాలు చోటుచేసుకున్నాయి.

1. జూన్ 2021లో ఖమ్మం జిల్లాలో 45 ఏళ్ల దళిత మహిళ మరియమ్మ పోలీసు కస్టడీలో మరణించింది. ఈ ఘటనతో ముగ్గురు పోలీసులను విధుల నుంచి తొలగించారు.

2. మార్చి 2022లో సూర్యాపేట పోలీసులు వీర శేఖర్‌ని కస్టడీలో హింసించడంతో అతని నాడీ వ్యవస్థ దెబ్బతింది.

3. మహ్మద్ ఖదీర్ (35) అనే కార్మికుడిపై 2023 ఫిబ్రవరిలో మెదక్ పోలీసులు రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. దాంతో ఆ వ్యక్తి కస్టడీలో మరణించాడు. ఈ కేసులో నలుగురు పోలీసులను సస్పెండ్ కు గురయ్యారు.

4. ఏప్రిల్ 2023లో ఆటోరిక్షా డ్రైవర్‌ తుకారాంగేట్ పోలీస్ స్టేషన్‌లో మరణించాడు. విచారణ సమయంలో అతనిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని బయటపడింది.

2023 మార్చిలో అన్ని పోలీసు స్టేషన్‌లలో సీసీ కెమెరాల స్థితిగతులు, ఫుటేజీల నిర్వహణపై నివేదిక సమర్పించాలని డీజీపీ అంజనీకుమార్‌ను హైకోర్టు ఆదేశించింది.

Read More: Andhra Pradesh: ఒబెరాయ్‌ హోటల్స్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CCTV Cameras
  • custody deaths
  • police stations
  • Rapolu Bhaskar
  • telangana
  • torture

Related News

Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, జనసేన మధ్య నెలకొన్న వివాదం చల్లారడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్, జనసేన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నె

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

  • The chicken curry that took the life of the father

    Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

Latest News

  • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

  • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd