Telangana Govt Sensational Decision : రవాణా శాఖలో ఆన్ డ్యూటీ(ఓడీ)లను రద్దు
- By Sudheer Published Date - 12:05 PM, Sat - 30 December 23

తెలంగాణ (Telangana)లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) కీలక నిర్ణయాలు (Sensational Decisions) తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పటీకే అనేక శాఖల్లో పలు మార్పులు , అధికారుల బదిలీ వంటి నిర్ణయాలు తీసుకోగా..తాజాగా రవాణా శాఖ(Transport Department)లో ఆన్ డ్యూటీ(ఓడీ)లను రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖలో ఉన్న ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల ఓడీలు రద్దు అయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖలో ముగ్గురు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగ నాయక్‌ను జేటీసీ అడ్మిన్‌గా ట్రాన్స్‌ఫర్ చేసింది. హైదరాబాద్ జేటీసీ అడ్మిన్‌గా ఉన్న మమతా ప్రసాద్ ను (IT & VIG)కు బదిలీ చేసింది. హైదరాబాద్ జేటీసీ ( IT & VIG)గా ఉన్న రమేష్ ను హైదరాబాద్ జేటీసీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులను శనివారం జారీ చేసింది.
Read Also : Dil Raju : నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీగా దిల్ రాజు..?