Telangana Govt : మే 13, జూన్ 4న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
- Author : Latha Suma
Date : 07-05-2024 - 11:56 IST
Published By : Hashtagu Telugu Desk
Lok Sabha Election: లోక్‌సభ ఎన్నిలక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఈనెల 13 సెలవు(holiday) ప్రకటించింది. ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ 13న జరగనుంది. దీంతో ఆ రోజు సెలవు ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఓట్ల కౌంటింగ్ రోజు అయిన జూన్ 4న కూడా ప్రభుత్వం హాలీడే డిక్లేర్ చేసింది. మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేతనంతో కూడిన సెలవులను ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల అధికారులు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న ఒకే దశలో జరగనున్నాయి. మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.
Read Also: KCR Vs Modi : నా అరెస్టుకూ మోడీ కుట్ర.. కేసీఆర్ సంచలన ఆరోపణ
రాష్ట్రంలో వేడిగాలుల కారణంగా 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక గంట పొడిగించారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో భాగమైన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు మే 13న రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకటి ఎంపీ, రెండోది ఎమ్మెల్యే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.
Read Also: RRR : రీ రిలీజ్‌కి సిద్దమైన ఆర్ఆర్ఆర్.. ఎప్పుడంటే..
ఎన్నికల కోసం 3,986 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 23,500 మంది ఉద్యోగుల పాల్గొననున్నారు. ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఓటు ఉన్న వారు విధిగా వచ్చి ఓటు వేయాలని కోరుతోంది.